ప్రజాభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజాభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి

Oct 20 2026 1:26 AM | Updated on Oct 20 2026 1:26 AM

రాజమహేంద్రవరం రూరల్‌: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో విలీన గ్రామాల కొత్త డివిజన్ల ఏర్పాటు విషయంలో ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కమిషనర్‌ రాహుల్‌ మీనాకు వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫోన్‌లో విన్నవించారు. సోమవారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో తొర్రేడు, వెంకటనగరం వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆయనను కలసి తమ గ్రామాలను కాతేరులోని కలిపి కొత్త డివిజన్లు ఏర్పాటు చేశారని అన్నారు. అయితే డివిజన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని నగరపాలక సంస్థ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా యథాతఽథంగా వచ్చాయని తెలిపారు. దీంతో చెల్లుబోయిన వేణు నగరపాలక సంస్థ కమిషనర్‌కు ఫోన్‌ చేసి డివిజన్ల ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయాలు తీసుకుని మార్పులు చేయాలని కోరారు. ˘

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement