కాతేరులో ఏర్పాట్లను పరిశీలించిన చెల్లుబోయిన, రమేష్‌యాదవ్
రాజమహేంద్రవరం రూరల్: వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన జోన్–2 ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల బీసీ నాయకుల సమావేశం కాతేరులోని వెంకటాద్రి గార్డెన్స్‌లో ఆదివారం ఉదయం 9.30 గంటలకు జరుగుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాచపల్లి రమేష్‌యాదవ్ తెలిపారు. శనివారం కాతేరులోని వెంకటాద్రి గార్డెన్స్‌లో ఏర్పాట్లను వారు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నవుడూరి వెంకటరమణ, పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ పరిశీలకుడు గూడూరి శ్రీనివాస్, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చందన నాగేశ్వర్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రమేష్‌యాదవ్ మాట్లాడుతూ బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ వారికి వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. బీసీలకు పెద్దపీట వేసిన ఘనత మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు పదవుల్లో, పథకాల్లో తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. రెండున్నరేళ్లుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రతి బీసీ సామాజిక వర్గీయుడికి అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మాజీ మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. మేధావులు, న్యాయవాదులు, వైద్యులు, బీసీ నేతలంతా హాజరై విజయవంతం చేయాలని చెల్లుబోయిన వేణు, రాచపల్లి రమేష్ యాదవ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గొందేశి శ్రీనివాసులరెడ్డి, ఒమ్మి రఘురామ్, చెల్లుబోయిన శ్రీనివాస్, కొండపల్లి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.


