● భార్యాభర్తలకు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
● రెండేళ్ల బాలుడు సురక్షితం
దేవరపల్లి, కంబాలచెరువు: ఖమ్మం–దేవరపల్లి 365 బీజీ గ్రీన్‌ఫీల్డ్ హైవేపై దేవరపల్లి సమీపంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య, భర్తలు తీవ్రంగా గాయపడగా, రెండేళ్ల బాలుడు, డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని చందానగర్ నుంచి ఇంటి సామాన్లతో ఖండవల్లి సుబ్రహ్మణ్యం, కామేశ్వరి దంపతులు తమ రెండేళ్ల చిన్నారి కృష్ణతో కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామానికి ఐసర్ వ్యాన్‌లో బయలుదేరారు. దేవరాపల్లి సమీపంలో వారి ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో జరిగిన ప్రమాదంలో ఆ దంపతులతో పాటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రెండేళ్ల బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. క్షతగాత్రులకు చికిత్స మెరుగైన చికిత్స కోసం గోపాలపురం నుంచి హైవే అంబులెన్స్‌లో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో కామేశ్వరికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని, వ్యాన్ డ్రైవర్‌కు చేయి విరిగిందని చికిత్స చేసినట్టు వైద్యులు తెలిపారు.


