బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో నీట్ పీజీ పరీక్షను అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నిర్వహించినట్టు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. జిల్లాలో ఆదివారం జరిగిన నీట్ పీజీ పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక సాఫ్ట్ టెక్నాలజీ, ఐయాన్ డిజిటల్ జోన్ పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరుగుతున్న తీరును, వసతుల కల్పన, విద్యార్థుల హాజరు ఇతర భద్రత ఏర్పాట్లను నేరుగా పరిశీలించి, అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రశాంత వాతావరణంలో ఈ పరీక్ష ముగిసిందని ఆయన తెలిపారు. ఈ పరీక్షకు కాకినాడ జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో 1159 మందికి గాను 1147 మంది విద్యార్థులు హాజరయ్యారని, 98.95 శాతం హాజరు నమోదైందని కలెక్టర్ చెప్పారు.


