పుష్కరాల ఏర్పాట్లపై కసరత్తు | - | Sakshi
Sakshi News home page

పుష్కరాల ఏర్పాట్లపై కసరత్తు

Aug 30 2026 12:09 AM | Updated on Aug 30 2026 12:09 AM

రాజమహేంద్రవరం ిసిటీ: గోదావరి పుష్కరాల సందర్భంగా ఘాట్లు, ఆలయాల వద్ద రద్దీ నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవడానికి క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నట్లు కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్‌తో కలసి నగరంలో ఆమె పర్యటించారు. పుష్కర ఘాట్లు, ప్రముఖ ఆలయాలు, రవాణా, పార్కింగ్‌ తదితర ప్రాంతాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడానికి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కోటిలింగాల ఘాట్‌కు చేరుకునే మార్గాలు, ఘాట్‌ పరిసరాలు, ఉమా కోటిలింగేశ్వరస్వామి దేవస్థానం, లూథర్‌గిరి, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అదే సమయంలో ఆర్ట్స్‌ కళాశాల వద్ద చేపట్టనున్న ఏర్పాట్లపై చర్చించారు. ఆయా ప్రాంతాల్లో భక్తుల రాకపోకలు, పార్కింగ్‌, బస్సుల నిర్వహణ, నడక మార్గాలు, క్యూ, ఎంట్రీ–ఎగ్జిట్‌ మార్గాలు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోటిలింగాల ఘాట్‌కు భక్తులు చేరుకునే మార్గాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు. భక్తులను ఒకేసారి ఘాట్లకు అనుమతించకుండా దశల వారీగా తరలించడం ద్వారా రద్దీని సమర్థవంతంగా నియంత్రించాలని, పోలీస్‌ శాఖ రూపొందించిన క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రణాళికను మరింత శాసీ్త్రయంగా రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. పుష్కర స్నానాల కోసం వచ్చే భక్తుల కోసం లూథర్‌గిరి, ఆర్ట్స్‌ కళాశాల ప్రాంతాల్లో సెటిల్‌ బస్సుల కోసం తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. భక్తులకు సురక్షితమైన పుష్కర అనుభూతి కల్పించేలా చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. ఈ పర్యటనలో జాయింట్‌ కలెక్టర్‌ వై.మేఘా స్వరూప్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ మహేష్‌, డీఎస్పీ వై.శ్రీకాంత్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement