గతంలో ఎన్నడూ లేనంతగా ధరలు పెరిగిపోయాయి. పంచదార, బెల్లం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గతంలో ఎప్పుడూ రూ.40 నుంచి రూ.45 మధ్యే ఉండేది. ప్రస్తుతం రూ.70 దాటిపోవడంతో శ్రావణ మాసంలో తీపి పదార్థాలు చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నాం. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయాయి. వాటి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
– డొక్కా నాగమణి,
మిర్తిపాడు, సీతానగరం మండలం
ఏమీ తినలేం.. కొనలేం
ధరలు మరీ దారుణంగా పెరిగిపోతున్నాయి. ఏమీ కొనలేం, తినలేం అన్నట్లు ఉంది. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగిపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తినడానికి భయపడే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. నూనె ధరలు పెరగడంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. పంచదార, బెల్లం ధరల పెరుగుదలతో టీ, కాఫీ కూడా తాగడానికి ఆలోచిస్తున్నాం.
– మాణిక్యాంబ,
అంగన్‌వాడీల సంఘం జిల్లా అధ్యక్షురాలు
సామాన్యులు బతకడం కష్టమే
చంద్రబాబు ప్రభుత్వంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏ వస్తువు కొనాలన్నా షాక్ తగులుతోంది. బియ్యం, నూనె, పంచదార, బెల్లం, కూరగాయలు... ఇలా సామాన్యులకు అవసరమైన వస్తువులన్నీ పెరిగిపోయాయి. ఏమీ కొనే పరిస్థితి లేదు. మాలాంటి సామాన్యులు బతకడం కష్టంగా మారింది. ప్రభుత్వం స్పందించి ధరలు నియంత్రించాలి.
–మేడిశెట్టి వెంకటలక్ష్మి,
అంగర, కపిలేశ్వరపురం మండలం


