రీజినల్‌ గేమ్స్‌లో లేహ్యశ్రీ రికార్డు | - | Sakshi
Sakshi News home page

రీజినల్‌ గేమ్స్‌లో లేహ్యశ్రీ రికార్డు

Aug 27 2026 12:30 AM | Updated on Aug 27 2026 12:30 AM

రాజానగరం: మండలం దివాన్‌చెరువుకు చెందిన 8వ తరగతి విద్యార్థిని లాలం లేహ్యశ్రీ కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్‌ (సీఐఎస్‌సీఈ) ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్‌, రావులపాలెంలో నిర్వహించిన రీజినల్‌ గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ 2026లో 9 పతకాలను అందుకుని రికార్డు నెలకొల్పింది. అండర్‌–14 విభాగంలో జరిగిన ఈ పోటీలలో రోలర్‌ స్కేటింగ్‌లో రెండు స్వర్ణం, రెండు రజతం, అథ్లెటిక్స్‌లో మూడు రజతం, రెండు కాంస్య పతకాలను కై వసం చేసుకుంది. గత ఏడాది ఇదే విభాగంలో స్కేటింగ్‌లో సత్తా చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న ఆ విద్యార్థిని ఈ ఏడాది రెండు విభిన్న క్రీడలలో అత్యుత్తమ ప్రతిభను కనబరచి ఏకంగా 9 పతకాలను అందుకుంది. జాతీయ స్థాయిలో అక్టోబర్‌ 7 నుంచి 9 వరకు ముంబైలో జరిగే రోలర్‌ స్కేటింగ్‌ నేషనల్స్‌, 13 నుంచి 15 వరకు హైదరాబాద్‌లో జరిగే అథ్లెటిక్స్‌ నేషనల్స్‌కు సిద్ధమవుతున్న ఆమె తన లక్ష్యం ఒలింపిక్స్‌ స్వర్ణమని అంటోంది.

బాల్యం నుంచి క్రీడలపై ఆసక్తి

లేహ్యశ్రీకి బాల్యం నుంచి క్రీడలంటే ఎంతో అసక్తి. స్కేటింగ్‌ అంటే ఎంతో మక్కువ. ఈ క్రమంలో గత ఏడాది ముంబైలో జరిగిన స్కేటింగ్‌ నేషనల్స్‌లోనూ, ఆగ్రాలో జరిగిన రోల్‌ బాల్‌ నేషనల్స్‌లోనూ పాల్గొని జాతీయ స్థాయిలో ప్రతిభను చాటింది. స్కేటింగ్‌ విభాగంలో రీజినల్‌, జోనల్‌ స్థాయిలో రెండు రజత పతకాలను సాధించింది. రోల్‌ బాల్‌ రాష్ట్ర స్థాయి పోటీల్లో కాంస్య పతకాన్ని అందుకుంది. క్రీడలతో పాటు సామాజిక సృహను చాటుతూ ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా మే 8 న నిర్వహించిన 5 కె రన్‌ పాల్గొని ప్రధమ స్థానంలో నిలిచింది.

9 పతకాలతో సత్తా చాటిన వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement