ఫఇంత నిర్లక్ష్యమా.. | - | Sakshi
Sakshi News home page

ఫఇంత నిర్లక్ష్యమా..

Aug 19 2026 12:12 AM | Updated on Aug 19 2026 12:12 AM

తూర్పుగోదావరి కలెక్టరేట్‌ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కళాశాలలో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ సమయంలో మైదానమంతా మువ్వన్నెల జెండాలతో మెరిసిపోయింది. వేడుకలు ముగిసిన అనంతరం జెండాలను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం మైదానంలో ఎక్కడ చూసినా కింద పడిపోయిన జెండాలు, ఇతర వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. వాటిని మంగళవారానికి కూడా తొలగించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, రాజమహేంద్రవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement