కాలువలో వ్యక్తి మృతదేహం | - | Sakshi
Sakshi News home page

కాలువలో వ్యక్తి మృతదేహం

Mar 7 2026 8:15 AM | Updated on Mar 7 2026 8:15 AM

రాయవరం: పసలపూడి బస్టాండ్‌ వద్ద మండపేట ప్రధాన కాలువలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కాలువ పైభాగం నుంచి మృతదేహం కొట్టుకువచ్చింది. మృతుని వయసు సుమారు 30 నుంచి 35 ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్నారు. ఒంటిపై లేత ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు చారల ఫుల్‌ హ్యాండ్స్‌ షర్ట్‌, బ్లూ జీన్‌ ఫ్యాంట్‌ ఉంది. మృతుడు 5.8 అడుగుల ఎత్తు ఉన్నాడు. ప్యాంట్‌ జేబులో సెల్‌ఫోన్‌ ఉంది. పొరపాటున కాలువలో పడి మృతి చెందాడా? లేక ఎవరైనా చంపి కాలువలో పడేశారా? అనే విషయం పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. రాయవరం ఎస్సై డి.సురేష్‌బాబు సిబ్బందితో వెళ్లి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మండపేట సీహెచ్‌సీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిస్తే 94409 04843 నంబర్‌కు ఫోన్‌ చేయాలని ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement