ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
నల్లజర్ల: అతి వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం నగరానికి క్యాటరింగ్‌కు సంబంధించిన మెటీరియల్‌ను వ్యాన్‌లో శుక్రవారం గుడివాడకు చెందిన కొండ్రు శ్రీనివాస్ (51), విజయవాడకు చెందిన శేషాద్రి, డ్రైవర్ కర్రి శివ తీసుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అతి వేగంగా వెళ్తున్న వ్యాన్ అనంతపల్లి ఎస్‌వీఆర్ కల్యాణ మండపం వద్ద జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న కొండ్రు శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన శేషాద్రి, శివలను చికిత్స నిమిత్తం హైవే అంబులెన్స్‌లో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన కొండ్రు శ్రీనివాస్ భార్య శైలజ ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటోంది. కుమారుడు కరుణకుమార్, కుమార్తె శ్వేతల బాగోగులు చూసుకుంటూ క్యాటరింగ్ పనులకు వెళ్లి తిరిగి వస్తుంటాడు. ఇదే క్రమంలో రాజమహేంద్రవరం వెళ్తూ మార్గం మధ్యలో చనిపోయాడు. ఎస్సై ఆంజనేయబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


