నాన్న ఆదేశాలతో దీక్ష స్వీకరించా
నాపేరు అన్యం రాంబాబు. మాది కోనసీమ జిల్లా కె.గంగవరం మండలంలోని అముజూరు గ్రామం. నేను డిగ్రీ వరకూ చదువుకున్నాను. ప్రస్తుతం బట్టల వ్యాపారం చేస్తున్నాను. మా ముత్తాత, మాతాత, మానాన్న ఈ దీక్ష స్వీకరించి కొన్ని గ్రామాల్లో సంచరించారు. మా నాన్నకు మోకాళ్ల గుజ్జు అరిగిపోయి ఆరోగ్యం క్షీణించింది. అందుకే వారసత్వం, సాంప్రదాయం కాపాడటానికి ఆయన ఆదేశాలతో ఈ దీక్షను స్వీకరించి నేను మోటారు సైకిల్‌పై కొనసాగిస్తున్నాను. మా ఈ ఆచారంలో చాలా ఉన్నతమైన ఉద్యోగం చేసుకునే వారు సైతం వారి అవకాశాన్ని బట్టి కనీసం రెండు రోజులైనా ఈ దీక్షను స్వీకరిస్తారు. రేపటి తరంలో నా కుమారుడు సైతం ఏ హోదాలో ఉన్న మా పూర్వీకులు తిరిగిన ప్రాంతాల్లో ఈ దీక్షను ఆచరించాలి. నేను కార్తికమాసంలో దీక్షను తీసుకున్నాను. సుబ్రహ్మణ్య షష్టికి దీక్షను విరమిస్తాను.


