జాతీయ పోటీలకు విద్యార్థులు
తొండంగి: జాతీయ స్థాయి పరుగుపందెం పోటీలకు అద్దరిపేట జెడ్పీ హైస్కూల్ పదో తరగతి విద్యార్థి పిక్కి జగదీష్ ఎంపికయ్యాడు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.దుర్గాకుమారి బుధవారం ఈ విషయం తెలిపారు. పెద్దాపురం ఎంఆర్ డిగ్రీ కళాశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ రెండు కిలోమీటర్ల పరుగు పందెం పోటీల్లో జగదీష్ రెండో స్థానంలో నిలిచాడన్నారు. జార్ఘండ్‌లో జనవరి 24న జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొండాడని తెలిపారు. కాకినాడ జిల్లా నుంచి జగదీష్ మాత్రమే అర్హత సాధించడం అభినందనీయమన్నారు. అతడు ఇప్పటికే రెండు సార్లు జిల్లా స్థాయి ప్రథమ, రాష్ట్ర స్థాయిలో ద్వితీ య స్థానాల్లో నిలిచాడన్నారు. జగదీష్‌తో పాటు పీఈటీ దుర్గాప్రసాద్‌లను అభినందించారు.
బీచ్ వాలీబాల్ పోటీలకు..
చాగల్లు: జాతీయ స్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఊనగట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని పంతకాని లాస్య ఎంపికై ంది. ఈ విషయాన్ని ఆ పాఠశాల ప్రధానోపాద్యాయులు ఎన్‌వీ రమణ బుధవారం విలేకరులకు తెలిపారు. బాపట్ల సూర్యలంక బీచ్‌లో ఈ నెల 19, 20 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలలో స్కూల్ గేమ్స్ అండర్ – 14 బాలికల విభాగంలో లాస్య ద్వితీయ స్థానం సాధించిందన్నారు. కొల్‌కతాలో ఫిబ్రవరిలో జరిగే జాతీయ స్థాయి బీచ్ వాలీబాల్ పోటీలో పాల్గొంటుందని తెలిపారు. అలాగే వాలీబాల్‌లోనూ లాస్య జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందని తెలిపారు. ఆ బాలికతో పాటు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు కొయ్య గంగాధరరావును అభినందించారు.
జాతీయ పోటీలకు విద్యార్థులు


