నిలదీస్తారని భయం.. తూతూమంత్రం | - | Sakshi
Sakshi News home page

నిలదీస్తారని భయం.. తూతూమంత్రం

Dec 5 2025 6:44 AM | Updated on Dec 5 2025 6:44 AM

నిలదీస్తారని భయం.. తూతూమంత్రం

నిలదీస్తారని భయం.. తూతూమంత్రం

సాక్షి, రాజమహేంద్రవరం: చేతికంది వస్తున్న పంట నోటికందుతుందనుకుంటుని ఆశ పడుతున్న తరుణంలో.. అధిక వర్షాలు.. ఆపై మోంథా తుపాను బీభత్సం.. తీవ్ర పంట నష్టాలు.. తడిసిన ధాన్యం.. కొనుగోళ్లకు సవాలక్ష నిబంధనలు.. గత్యంతరం లేక దళారులకే అయినకాడికి అమ్ముకుని నష్టపోతున్న దుస్థితి.. తాజాగా దిత్వా తుపాను.. నయాపైసా కూడా అందని పరిహారం.. ఉచిత పంటల బీమా ఎత్తివేత.. ఇతర పంటలకూ గిట్టుబాటు ధరలు లేకపోవడం.. ఇలా అన్నదాతలు పుట్టెడు కష్టాల్లో ఉన్న తరుణంలో.. ‘రైతన్నా మీకోసం’ పేరిట సర్కారు వారు చేపట్టిన కార్యక్రమం జిల్లాలో తూతూమంత్రంగా ముగిసిపోయింది. సమస్యలపై రైతులు ఎక్కడ తమను నిలదీస్తారోననే భయంతో కూటమి ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో మొక్కుబడిగానే పాల్గొన్నారు. దీంతో, వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం సీఎం సందేశ పత్రాలు రైతులకు ఇచ్చేందుకు మాత్రమే పరిమితమైంది. రైతుల సమస్యలు విన్న, పరిష్కరించిన దాఖలాలు లేకుండా పోయింది.

అనుకున్నదొకటి.. అయ్యిందొకటి

నీటి భద్రత, డిమాండ్‌ ఆధారిత పంటలు, అగ్రిటెక్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ప్రభుత్వాల మద్దతు, రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అన్ని రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) పరిధిలో గత నెల 24 నుంచి 30వ తేదీ వరకూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి రైతుల సమస్యలు తెలుసుకుని, పరిష్కార మార్గాలు చూపాలి. అయితే ‘అనుకున్నదొకటి.. అయినది ఒక్కటి’ అన్న చందంగా ఈ కార్యక్రమం మారింది. రైతుల ఇళ్ల వద్దకు ప్రజాప్రతినిధులు వెళ్లకుండానే ముగిసిపోయింది. అధికారులు కూడా అక్కడక్కడ రైతుల ఇళ్లకు మొక్కుబడిగా వెళ్లి, సీఎం సందేశ పత్రాలు పంపిణీ చేయడం, కాసేపు అక్కడే కూర్చొని నాలుగు మాటలు చెప్పడం.. వెనుదిరగడంతో సరిపెట్టారు. కేవలం ప్రచారార్భాటం తప్ప.. ఈ కార్యక్రమంతో తమకు ఒరిగిందేమీ లేదని రైతులు విమర్శిస్తున్నారు.

అందుకే ముఖం చాటేశారు

అక్టోబర్‌ నెలాఖరులో మోంథా తుపాను విధ్వంసంతో రైతులకు తీవ్ర నష్టం కలిగింది. వారిని ఆదుకోవాల్సి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. మరోవైపు హామీ ఇచ్చిన మేరకు అన్నదాత సుఖీభవ నిధులు ఇవ్వలేదు. నిబంధనల పేరుతో ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా చేయకపోవడం.. ఈ–క్రాప్‌ సక్రమంగా చేయకపోవడం వంటి చర్యలతో చంద్రబాబు ప్రభుత్వంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో తమను రైతులు నిలదీస్తారనే భయంతో అధికార కూటమి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రైతన్నా మీకోసం కార్యక్రమానికి ముఖం చాటేశారు. కేవలం తమకు అనుకూలమని భావించిన రైతుల వద్దకు వెళ్లి, వారికి ఏదో చేసేస్తున్నట్లు కలరింగ్‌ ఇచ్చి దుకాణం సర్దేశారు. చంద్రబాబు సర్కారుపై డబ్బా కొట్టడానికే పరిమితమయ్యారు. కొన్నిచోట్ల తమ వద్దకు వచ్చిన ప్రజాప్రతినిధులకు రైతులు తమ కష్టాలు చెప్పుకోగా.. వారు చూద్దాం అని దాటవేత ధోరణి అవలంబించారు. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ మధ్య విభేదాలతో ఎవ్వరూ ఈ కార్యక్రమాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు.

పరిహారం అందక..

జిల్లావ్యాప్తంగా మోంథా తుపాను ప్రభావంతో వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.40.96 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఈ మేరకు అధికారులు నివేదిక పంపించి నెల దాటుతున్నా.. నేటికీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదు. దీనిపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వారి వద్దకు వెళ్తే ఎక్కడ నిలదీస్తారోననే ఆందోళనతో ప్రజాప్రతినిధులు ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెనుకడుగు వేశారు.

‘అన్నదాత సుఖీభవ’లోనూ మోసం

అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రంతో సంబంధం లేకుండా రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు అండ్‌ కో హామీ ఇచ్చారు. తీరా చూస్తే ఏడాదిన్నర కాలంలో కేంద్రంతో కలిపి ఇప్పటి వరకూ ఇచ్చింది. రూ.14 వేలు మాత్రమే. అది కూడా చాలా మంది రైతులకు ముఖ్యంగా కౌలు రైతులకు ఎగ్గొట్టారు. దీనిపై రైతులు నిలదీస్తారనే భయంతో కూడా కూటమి నేతలు ఈ కార్యక్రమానికి ముఖం చాటేశారు.

నేతలు పాల్గొన్నారిలా..

ఫ రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకటి రెండు రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొని, తరువాత మిన్నకుండిపోయారు. పొలం ఎక్కడుంటే అక్కడే ఎరువులు ఇస్తామంటున్నారని.. పొలం ఎక్కడున్నా.. తాము నివసిస్తున్న ప్రాంతంలోనే ఎరువులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆ సందర్భంగా రైతులు విన్నవించారు.

ఫ అనపర్తి నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తమకు అనుకూలమైన, టీడీపీ, జనసేన సానుభూతిపరులున్న పాలమూరు గ్రామంలో రైతుల ఇళ్లకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు.

ఫ నిడదవోలు నియోజకవర్గంలో జనసేన, టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో నేతలెవరూ రాకపోవడంతో ఈ కార్యక్రమం తూతూమంత్రంగా సాగింది.

ఫ గోపాలపురం, కొవ్వూరు, రాజానగరం నియోజకవర్గాల్లో సైతం నేతలు నామ్‌ కే వాస్తే అన్న చందంగా పాల్గొని, మిన్నకుండిపోయారు.

·˘ hÌêÏ ÐéÅç³¢…V>

పుట్టెడు కష్టాల్లో కర్షకులు

·˘ {ç³Õ²Ýë¢Æý‡¯ól B…§øâýæ¯]l™ø OÆð‡™èl$ÌS

ఇళ్లకు వెళ్లని కూటమి నేతలు

·˘ A¯]l$MýS*ÌS…V> E…yól ÐéÇMóS MýSÆý‡ç³{™éË$ ç³…_ Ñ$¯]l²MýS$¯]l² OÐðl¯]l…

·˘ Ððl¬MýS$PºyìlV> "OÆð‡™èl¯é² Ò$MøçÜ…'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement