సదరన్ ట్రావెల్స్ రిటైల్ బ్రాంచ్ ప్రారంభం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ప్రముఖ ట్రావెల్ సంస్థ సదరన్ ట్రావెల్స్ రాజమహేంద్రవరంలో తన కొత్త రిటైల్ బ్రాంచ్‌ను ఆదివారం ప్రారంభించింది. నగర, పరిసర ప్రాంతాల ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ట్రావెల్ సేవలను సులభంగా అందించాలనే లక్ష్యంతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తొలుత ఈ కార్యాలయాన్ని ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఏపీఐసీసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. పలువురు ప్రముఖులు, సినీ తారలు, టూరిజం భాగస్వాములు, కస్టమర్లు హాజరయ్యారు. సదరన్ ట్రావెల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ అలపాటి మాట్లాడుతూ రాజమహేంద్రవరం ప్రజలకు విశ్వసనీయమైన, సౌకర్యవంతమైన సేవలను అందించడమే తమ సంస్థ లక్ష్యమన్నారు. ఈ కొత్త బ్రాంచ్ ద్వారా దేశీయ, అంతర్జాతీయ హాలీడే ప్యాకేజీలను మరింత విస్తృతంగా అందిస్తామన్నారు. ఇప్పటి వరకూ సదరన్ ట్రావెల్స్ 45 లక్షలకు పైగా సంతృప్తి చెందిన కస్టమర్లకు సేవలందిస్తూ, 99 శాతం కస్టమర్ రిటెన్షన్ రేటును సాధించిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రెండు వేలకు పైగా గ్రూప్, కస్టమైజ్డ్ హాలిడే ప్యాకేజీలను అందిస్తుందన్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ నుంచి ఎనిమిది సార్లు ‘నేషనల్ టూరిజం అవార్డు’ను అందుకోవడంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల పర్యాటక శాఖలు, ఇతర ప్రతిష్టాత్మక సంస్థల నుంచి కూడా అనేక పురస్కారాలను అందుకుందన్నారు. సదరన్ గ్రూప్ ఢిల్లీ, జైపూర్, వారణాసి (కాశీ విశ్వనాథ్ కారిడార్), విజయవాడలో హోటళ్లను నిర్వహిస్తూ 225కి పైగా రూమ్ ఇన్వెంటరీ కలిగి ఉందన్నారు. ఇతర వివరాలకు 99495 23236, 95057 26000 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని అన్నారు.


