ఉత్సాహంగా మారథాన్
కాకినాడ రూరల్: ఆమె భద్రత – మన బాధ్యత అనే నినాదంతో కాకినాడలో ఆదివారం మారథాన్ ఉత్సాహంగా జరిగింది. సూర్యారావుపేట వద్ద న్యూ ఎన్టీఆర్ బీచ్ నుంచి జరిగిన అఫెక్స్ కాకినాడ సీపోర్ట్స్ మారథాన్ – 2026 ఎనిమిదో ఎడిషన్ విజయవంతమైంది. పరుగో పరుగో అన్నట్టుగా కాకినాడతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువతీ, యువకులు వచ్చి పోటీ పడ్డారు. కాకినాడ నుంచి ఉప్పాడ వరకూ ఆఫ్ మారథాన్‌గా 21.1 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించారు. తొలుత బీచ్ వద్ద పోటీల్లో పాల్గొనే వారితో వార్మఫ్ నిర్వహించారు. తొలుత మారథాన్‌ను సీపోర్ట్స్ సీఓఓ మురళీధర్, అఫెక్స్ సీ ప్రోజోన్ ఫుడ్స్ కె.చౌదరి, ఓఎన్జీసీ ఈఈ ప్రభాల్ సేన్ గుప్తా, జీఆర్‌టీ హోటల్ జీఎం శివకిరణ్, సంకురాత్రి ఫౌండేషన్ జీఎం రమణమూర్తి, రెడ్‌క్రాస్ చైర్మన్ వైడీ రామారావు తదితరులు ప్రారంభించారు. నాలుగు విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి కాకినాడ రన్నర్స్ ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ సుధా కేశవరాజు, ట్రస్టీ, మారథాన్ డైరెక్టర్ ఎన్‌ఎల్ శ్రీనివాస్ తదితరుల ఆధ్వర్యంలో జ్ఞాపికలను అందజేశారు.
ఉత్సాహంగా మారథాన్


