రైతుకు ఇచ్చిన భరోసా ఏమిటి?
·˘ ^èl…{§ýl»êº$ ç³Æý‡År¯]l™ø
ప్రజాధనం దుర్వినియోగమే..
·˘ Ð]l*i çßZ… Ð]l$…{† ™é¯ólsìæ Ð]l°™èl ÑÐ]l$Æý‡Ø
దేవరపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు నల్లజర్ల పర్యటన వల్ల ప్రజాధనం దుర్వినియోగం తప్ప, రైతులకు ఒరిగిందేమీ లేదని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత విమర్శించారు. యర్నగూడెంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. రైతన్నా మీకోసం కార్యక్రమం ద్వారా రైతులకు ఇచ్చిన భరోసా ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె ఏమన్నారంటే..
ఫ మోంథా తుపాను బాధిత రైతులను కనీసం పట్టించుకోలేదు. దెబ్బ తిన్న పంటలకు పరిహారం ఎప్పుడిస్తారో చెప్పాలి. తుపాను బాధిత రైతులకు వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి, ఆదుకోవాలి.
ఫ వరికి కనీస మద్దతు ధర ఇస్తామనే హామీయే లేదు. కష్టాల్లో ఉన్న అన్నదాతకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వం కనీసంగా కూడా పట్టించుకోవడం లేదు. వరి సాగుతో దేశానికే అన్నపూర్ణగా నిలిచిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రెండో పంటగా వరికి బదులు ఉద్యాన సాగు చేసుకోవాలని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం. ఏడెనిమిది నెలల్లో చేతికొచ్చే ఉద్యాన పంటలు ఎక్కడున్నాయో చెప్పాలి. ఆయిల్‌పామ్, కోకో, కొబ్బరి వంటి పంటలు సాగు చేసుకోవాలని చంద్రబాబు అంటున్నారు. ఉద్యాన పంటలు వేసిన పొలాలు వరి సాగుకు పనికొస్తాయా? మెట్ట ప్రాంతంలో సాగు చేస్తున్న పంటలపై చంద్రబాబుకు కనీస అవగాహన లేదనే విషయం దీనిని బట్టి తెలుస్తోంది.
ఫ యూరియా కొరతపై ప్రభుత్వాన్ని రైతులు నిలదీస్తే యూరియా వాడి పండించిన వరి అన్నం తింటే క్యాన్సర్ వస్తుందని చంద్రబాబు చెప్పారు. మరి చిరుధాన్యాల పంటల సాగుకు ప్రభుత్వం కల్పించిన భరోసా ఏముంది?
ఫ గోదావరి జలాలను వంశధారకు అనుసంధానం చేయడం వల్ల గోపాలపురం నియోజకవర్గ ప్రజలకు ఉపయోగం లేదు.
ఫ రైతు సమావేశంలో రైతులకు కనీసం యంత్రాలు, ఇన్‌పుట్ సబ్సిడీలు అందించకుండా సీఎం మొక్కుబడిగా పర్యటించారు.
ఫ నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా ఉన్న ఎర్ర కాలువ, తాడిపూడి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువల అభివృద్ధి, ఏటా వేలాది ఎకరాలను ముంచెత్తుతున్న కొవ్వాడ కాలువల గురించి చంద్రబాబు ఒక్క మాట కూడా చెప్పకపోవడం బాధాకరం.
ఫ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధేమీ లేదు. ఏ గ్రామానికి వెళ్లినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గత సంక్రాంతికి రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తామన్న చంద్రబాబు హామీ అమలు కాలేదు. మళ్లీ వచ్చే సంక్రాంతి నాటికి మరమ్మతులు చేస్తానని నల్లజర్ల సమావేశంలో ప్రకటించి ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారు. 16 నెలల్లో జరగని రోడ్ల మ రమ్మతులు 50 రోజుల్లో ఎలా పూర్తవుతాయి?
ఫ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో టన్ను ఆయిల్‌పామ్ గెలల ధర రూ.23 వేలు పలకగా, ప్రస్తుతం రూ.19,600 ఉంది. కౌలు రైతులకు ఈ ధర గిట్టుబాటు కావడం లేదు.
ఫ ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టి రైతులపై భారం మోపింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టి విపత్తులు సంభవించి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించింది.
రైతుకు ఇచ్చిన భరోసా ఏమిటి?
రైతుకు ఇచ్చిన భరోసా ఏమిటి?
రైతుకు ఇచ్చిన భరోసా ఏమిటి?


