షో చేసి వెళ్లారు
అనేక సమస్యలతో సతమతమవుతున్న రైతులకు ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంతో ఎలాంటి మేలూ జరగలేదు. వాళ్ల వద్దకు వస్తే ఎక్కడ నిలదీస్తారోనని ఎమ్మెల్యేలు ముఖం చాటేశారు. తమకు అనుకూలమైన రైతుల వద్దకు వచ్చి షో చేసి వెళ్లిపోయారు. గ్రామ శివారులో ఎవరికీ తెలియకుండా ఇద్దరు రైతులను కలిసి సీఎం సందేశ పత్రాలు ఇచ్చి వెళ్లిపోయారు. మోంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. ఈ–క్రాప్ సక్రమంగా చేయలేదు. ధాన్యం కొనుగోళ్లు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి.
– పరిమి సోమరాజు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి
మద్యం తాగిస్తే రోగాలు రావా?
ఉండ్రాజవరం మండలం కాల్దారి గ్రామంలో గిట్టుబాటు ధర కోసం 1994లో రైతులు ధర్నా చేస్తున్న సమయంలో ఇద్దరు రైతులను పోలీసులు కాల్చి చంపారు. ఆ అప్రతిష్టను చంద్రబాబు మూటగట్టుకున్నారు. వరి పండిస్తే షుగర్, క్యాన్సర్ వస్తాయని ఆయనంటున్నారు. కానీ, ఇంటింటికీ మద్యం అందిస్తున్నారు. అది తాగితే క్యాన్సర్, షుగర్ రావా? రాగులు పండించాలని ఉచిత సలహా ఇస్తున్నారు. పుష్కలంగా నీరున్న ప్రాంతంలో వరి పండించి, ప్రజలకు మేలు చేయాలని చూస్తూంటే.. వద్దని చెప్పడం తగదు. రైతన్నా మీకోసం పేరుతో ఎలాంటి సభలూ పెట్టలేదు.
– బూరుగుపల్లి సుబ్బారావు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్


