దాతలే ఆధారం
రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు నిధులు కేటాయించక పోవడంతో పోటీల నిర్వహణకు దాతలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క స్పోర్ట్స్ మీట్ నిర్వహణకు దాదాపు రూ1.50 లక్షల నుంచి రూ.4 లక్షలు వరకూ ఖర్చవుతుంది. క్రీడాకారులకు అందించే పతకాలు, ట్రోఫీలను కూడా నిర్వాహకులే తమ సొంత ఖర్చులతో కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక భోజనాలను దాతల సహకారంతో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర స్థాయిలో రూ.7 కోట్ల బడ్టెట్ ఉన్నా జిల్లాల వారీగా అరకొర నిధుల కేటాయింపుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.


