వైఎస్సార్ సీపీ నేత కారుకు నిప్పు పెట్టిన యువకులు
రమేష్‌ను వివరాలు అడిగి తెలుసుకుంటున్న చెల్లుబోయిన నరేన్
పెట్రోలు పోసి నిప్పటించడంతో దగ్ధమైన రమేష్‌కు చెందిన కారు
రాజమహేంద్రవరం రూరల్: వెంకటనగరం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత మోతా రమేష్‌కు చెందిన ఐ20 కారును మంగళవారం తెల్లవారుజామున 1.30 నుంచి 2.20 గంటల మధ్య సమయంలో ఇద్దరు యువకులు పెట్రోలు పోసి నిప్పుపెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. ఇంటిముందు కారు పార్కింగ్ చేసి ఉండగా ఈ ఘటనకు పాల్పడ్డారు. వెంకటనగరంనకు చెందిన కొల్లపుధోనీ, గుమ్మడి చరణ్‌లపై అనుమానం ఉందని, పూర్తి విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని మోతారమేష్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. త్రీ టౌన్ ఎస్సై అప్పలరాజు ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేపట్టారు.
ఎస్పీకి ఫిర్యాదు చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ
ఈ విషయం తెలియగానే తిరుపతి పర్యటనలో ఉన్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫోన్‌లో ఎస్పీ డి.నరసింహకిశోర్‌కు ఫిర్యాదు చేశారు. వెంకటనగరం గ్రామంలో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కారు దగ్ధం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. వేణుగోపాలకృష్ణ తన కుమారుడు నరేన్, పార్టీ నాయకులను వెంకటనగరం పంపించారు. మోతారమేష్‌ను చెల్లుబోయిన నరేన్ కలిసి ఘటనపై ఆరా తీశారు. అధైర్యపడవద్దని పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నరేన్ డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు ఆచంట కళ్యాణ్, సుందరపల్లి అనిల్, చాపరాజా, అప్పానాని, ఓడూరి రాంకీ, కొల్లినాని, కల్లూరి చైతన్య, ఉండ్రాజవరపు సూర్య, నక్కాధనరాజ్, అల్లంపల్లి శ్రీను, పంతం ప్రసాద్, వెంకటనగరం వైఎస్సార్ సీపీనే తలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ నేత కారుకు నిప్పు పెట్టిన యువకులు


