బాలిక అదృశ్యంపై కేసు | - | Sakshi
Sakshi News home page

బాలిక అదృశ్యంపై కేసు

Dec 3 2025 8:05 AM | Updated on Dec 3 2025 8:05 AM

బాలిక

బాలిక అదృశ్యంపై కేసు

సీతానగరం: మండలంలోని పురుషోత్తపట్నంకు చెందిన పదేళ్ల మల్లి సాత్విక కనిపించడం లేదని పెదనాన్న మల్లి బాపిరా జు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై డి.రామ్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. పురుషోత్తపట్నంకు చెందిన మాటలు సరిగా పలకని (మూగ) సాత్విక సోమవారం 5.30 గంటలకు వీధిలో తోటి పిల్లలతో ఆటలు ఆడింది. తర్వాత కనిపించకుండా పోయింది. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే 94409 04832, 94409 04829 నంబర్లకు కాల్‌ చేయాలని ఎస్సై కోరారు.

జాతీయ స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌లో బంగారు పతకం

ప్రకాశంనగర్‌ (రాజమహేంద్రవరం): 69వ జాతీయ స్థాయి స్కూల్‌ గేమ్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో అండర్‌–17 విభాగంలో నగరానికి చెందిన జూహిత గుణ బంగారు పతకం సాధించింది. లాలాచెరువు మున్సిపల్‌ హై స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న జూహిత అరుణాచల్‌ప్రదేశ్‌లో జరుగుతున్న జాతీయ స్ధాయి పోటీల్లో ఈ ఘనత సాధించింది. ఇటీవలే కామన్‌ వెల్త్‌ జూనియర్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొన్ని బంగారు పతకం సాధించిన జూహిత ఆసియన్‌ ఒలింపిక్స్‌లో ఇండియా తరఫున పాల్గొని పతకాలు సాధించడమే లక్ష్యంగా పుణే స్టోర్ట్స్‌ అకాడమిలో శిక్షణ తీసుకుంటోంది.

బాలిక అదృశ్యంపై కేసు 1
1/1

బాలిక అదృశ్యంపై కేసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement