మొరాయించిన సర్వర్లు
ఫ 4 రోజులుగా నిలిచిన ధాన్యం కొనుగోళ్లు
ఫ రైతుల పడిగాపులు
పెరవలి: ఖరీఫ్ ఆది నుంచీ నష్టాల పాలైన రైతులకు ధాన్యం చేతికి వచ్చినా కష్టాలు తప్పటం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్తే సర్వర్లు మొరాయించడంతో అమ్మకాలకు పడిగాపులు పడుతున్నారు. ప్రస్తుతం ఒకవైపు తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తూండగా.. మరోవైపు గత శనివారం నుంచి సర్వర్ సమస్య రావడంతో ధాన్యం అమ్మలేక, దాచడానికి చోటు లేక నానాపాట్లూ పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నా పట్టించుకున్న వారే లేరని వాపోతున్నారు. కొనుగొలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నా ఏ ఒక్క రైతు వివరాలూ ఆన్‌లైన్ అవడం లేదని, మరోవైపు వాతావరణం భయపెడుతోందని ఆవేదన చెందుతున్నారు. సర్వర్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.
మొరాయించిన సర్వర్లు


