రూ.200, రూ.150 నాణేల సేకరణ
అమలాపురం టౌన్: స్వామి దయానంద సరస్వతి జన్మించి 200 సంవత్సరాలు, ఆర్య సమాజ స్థాపన జరిగి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కోల్‌కతా టంకశాల రూ.200, రూ.150 నాణేలను ముద్రించి విడుదల చేసింది. ఈ నాణేలను అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. 1824 ఫిబ్రవరి 12న జన్మించిన స్వామి దయానంద సరస్వతి అజ్ఞానాంధకారం, దారిద్య్రం, అన్యాయాలను ఎదిరించి పోరాడిన ఓ మహర్షి. 1875 ఏప్రిల్ 10న ముంబై నగరంలో ఆర్య సమాజాన్ని స్థాపించారు. స్వామి దయానంద సరస్వతి ధర్మ సంస్థాపనకు శాశ్వత సంస్థగా ఆర్య సమాజాన్ని నెలకొల్పారు. దేశంలో మొట్టమొదటి సారిగా ఈ నాణేలను నికెల్ సిల్వర్‌తో రూపొందించారు. ఈ నాణేలు ఒక్కొక్కటి 32 గ్రాముల బరువు ఉండి 60 శాతం రాగి, 20 శాతం నికెల్, మరో 20 శాతం జింక్ కలిగి ఉంటాయి. స్వామి దయానంద సరస్వతి ముఖచిత్రంతో రూ.200 నాణెం, ఆర్య సమాజం ముద్రతో రూ.150 నాణేన్ని ముద్రించారని సేకరణ కర్త కృష్ణ కామేశ్వర్ తెలిపారు.
రూ.200, రూ.150 నాణేల సేకరణ


