గుర్తు తెలియని మృతదేహం వెలికితీత
కిర్లంపూడి: గుర్తు తెలియని మృతదేహం లభ్యంపై సోమవారం కేసు నమోదైనట్టు హెడ్ కానిస్టేబుల్ మూర్తి తెలిపారు. మండల పరిధి వేలంకలోని విద్యుత్ సబ్ స్టేషన్ పక్కనే ఉన్న కాలువలో స్థానికులకు మృతదేహం కనబడడంతో వీఆర్‌ఓ ఇప్పర్తి దేవ సహాయం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడికి 35–45 వయసు ఉంటుంది. బ్లూ టీషర్టు, షార్టు దుస్తులు వేసుకున్నట్లు తెలిపారు. వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ప్రత్తిపాడు పీహెచ్‌సీకు తరలించారు.


