పీజీఆర్‌ఎస్‌కు 178 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కు 178 అర్జీలు

Dec 2 2025 8:16 AM | Updated on Dec 2 2025 8:16 AM

పీజీఆ

పీజీఆర్‌ఎస్‌కు 178 అర్జీలు

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో ప్రజలు 178 అర్జీలు సమర్పించారు. వారి నుంచి జాయింట్‌ కలెక్టర్‌ వై.మేఘస్వరూప్‌ తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీనీ నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ టి.సీతారామమూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సజావుగా పింఛన్ల పంపిణీ

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ సజావుగా సాగిందని కలెక్టర్‌ కీర్తి తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకే 79 శాతం పంపిణీ పూర్తయ్యిందన్నారు. రాజమహేంద్రవరంలోని గాంధీపురం–1 సుబ్బారావుపేటకు చెందిన నామాల రామాయమ్మ(78)కు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్‌ సొమ్ము పంపిణీ చేయడాన్ని కలెక్టర్‌ స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా 2,34,520 మంది లబ్ధిదారులకు రూ.102.64 కోట్ల మేర పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

ఏపీఎస్‌ఈఏ

కార్యవర్గం ఎన్నిక

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఆంధ్రప్రదేశ్‌ సర్వే ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏపీఎస్‌ఈఏ) జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు సోమవారం రాజమహేంద్రవరంలో నిర్వహించారు. ఎన్నికల అధికారి రౌతు రామకృష్ణ, ఉప ఎన్నికల అధికారి రమాబాయి ఆధ్వర్యంలో ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా అధ్యకుడిగా తాళ్లపూడి మండల సర్వేయరు (ఎంఎస్‌)పి.సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌ టౌన్‌ సర్వేయర్‌ కేవీవీ రవికాంత్‌, కార్యదర్శిగా కాతేరు–3 (వీఎస్‌) ఎస్‌.సత్యనారాయణ, ఉప కార్యదర్శిగా వెదురుపాక విలేజ్‌ సర్వేయర్‌ (వీఎస్‌) వై.గంగరాజు, కోశాధికారిగా దూబచర్ల –1 (వీఎస్‌) జి.వెంకటేష్‌ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా నాగేంద్ర, చరణ్‌, షాజహాన్‌, రత్నాచారి, రాజ్‌ కుమార్‌, సత్య మణికంఠలను ఎన్నుకున్నారు.

పోలీసు పీజీఆర్‌ఎస్‌కు

33 ఫిర్యాదులు

రాజమహేంద్రవరం రూరల్‌: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 33 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజల నుంచి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ స్వయంగా ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్‌ పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. సివిల్‌, కుటుంబ సమస్యలు, చీటింగ్‌, కొట్లాట తదితర కేసులకు సంబంధించి ప్రజలు ఫిర్యాదులు అందజేశారు.

ఉత్తమ ల్యాబ్‌

టెక్నీషియన్‌గా దుర్గాప్రసాద్‌

తాళ్లపూడి: కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పని చేస్తున్న వాజా దుర్గాప్రసాద్‌ జిల్లా ఉత్తమ ల్యాబ్‌ టెక్నీషియన్‌ అవార్డు అందుకున్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాలలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయనకు అధికారులు ఈ అవార్డు అందించారు. టీబీ, లెప్రసీ, ఎయిడ్స్‌ జిల్లా అధికారి వసుంధర, జిల్లా జడ్జి, కళాశాల ప్రిన్సిపాల్‌ దుర్గాప్రసాద్‌ను సత్కరించి, ప్రసంసా పత్రం, జ్ఞాపిక అందజేశారు. దుర్గాప్రసాద్‌కు గతంలో 2012, 2013, 2023 సంవత్సరాల్లో కూడా ఉత్తమ సేవలకు అవార్డు లభించాయి. ఆయనను ఆసుపత్రి సిబ్బంది అభినందించారు.

పీజీఆర్‌ఎస్‌కు 178 అర్జీలు 1
1/2

పీజీఆర్‌ఎస్‌కు 178 అర్జీలు

పీజీఆర్‌ఎస్‌కు 178 అర్జీలు 2
2/2

పీజీఆర్‌ఎస్‌కు 178 అర్జీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement