తీవ్ర నష్టాలు
అరటి పంట తీవ్ర నష్టాలు మిగిల్చింది. తోటలు అమ్మినప్పుడు మంచి ధర లభించింది. నేడు మార్కెట్లో ధరలు పతనమవడంతో వ్యాపారులు సగానికి సగం కోత పెడుతున్నారు. దీంతో, మేం నష్టపోవాల్సి వచ్చింది. అసలు తోటలు కొనుగోలు చేయటానికే ఎవరూ రావటం లేదు.
– వాకలపూడి గాంధీ, అరటి రైతు, కానూరు
కొబ్బరి ధర పతనం
కొబ్బరి ధరలు దారుణంగా పతనమయ్యాయి. రెండు నెలలు క్రితం వెయ్యి కాయల ధర రూ.32 వేలు పలికితే నేడు రూ.8 వేలు ఉంది. అంటే వెయ్యి కాయలకు రూ.24 వేల మేర ధర పతనమైంది.
– పెనుమత్స వెంకట గోపాలకృష్ణంరాజు,
కొబ్బరి రైతు, ఖండవల్లి
ఇంత దారుణం ఎప్పుడూ లేదు
కోకో పంట దిగుబడి బాగున్నా వ్యాపారులు సిండ్‌కేట్‌గా మారి ధరలు తగ్గించారు. గతం ప్రభుత్వంలో కిలో రూ.1,050 పలికితే నేడు రూ.350 లభిస్తోంది. ఇంత దారుణం ఎప్పుడూ లేదు.
– వాకలపూడి సూర్యారావు,
కోకో రైతు, కానూరు
ప్రభుత్వమే ఆదుకోవాలి
క్వింటాల్ మొక్కజొన్న గింజలకు గత ఏడాది ధర రూ.2,600 ఉంటే నేడు రూ.2,200కు పడిపోయింది. దీంతో ఆర్థికంగా నష్టపోయాం, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతులను ఆదుకోవలసింది ప్రభుత్వమే.
– కంటిపూడి సూర్యనారాయణ,
మొక్కజొన్న రైతు, తీపర్రు
తీవ్ర నష్టాలు
తీవ్ర నష్టాలు
తీవ్ర నష్టాలు


