అదిరే.. కళ్లు చెదిరే..
ల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): చిన్నారుల కేరింతలు.. ముద్దులొలికే మాటలు.. అబ్బురపర్చిన వివిధ వేషధారణలు.. ఉర్రూతలూగించేలా జానపద నృత్యాలు.. శాస్త్ర సాంకేతికపరమైన సైన్సు ప్రయోగాలు.. కోలాటాల మధ్య గోదావరి బాలోత్సవం ఆదివారం అట్టహాసంగా ముగిసింది. శనివారం ఉదయం రాజమహేంద్రవరం ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాలలో ప్రారంభమైన గోదావరి బాలోత్సవంలో ఆదివారం సాయంత్రం వరకూ వేలాది మంది చిన్నారులు వివిధ రంగాల వారీగా తమలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రయత్నాలు చేశారు. మొత్తంగా రెండు రోజుల పాటు సుమారు 10 వేల మందికి పైబడి పిల్లలు పాల్గొన్నారు. తమ ప్రతిభను చాటుకునేందుకు చిన్నారులు క్లాసికల్ డ్యాన్స్, సైన్సు ప్రయోగాలు, గణిత ఫజిల్స్, జానపద నృత్యాలు, కోలాటం, లఘు నాటికలు, జానపద గీతాలాపన, దేశభక్తి గీతాలాపన, విచిత్ర వేషధారణలు, బురక్రథలతో పాటు, కార్టూన్లు, మట్టితో బొమ్మల తయారీ, చిత్రలేఖనం పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో చిన్నారులతో పాటు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్దఎత్తున పాల్గొనడంతో ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాలలో పండగ వాతావరణం నెలకొంది.
చిన్నారులకు వివిధ రంగాల వారీగా జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం జరిగింది. ఇందులో యూనియన్ బ్యాంకు రీజినల్ హెడ్ ఎ.విశ్వేశ్వరరావు, ఎల్‌ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ సత్యనారాయణ సాహూ, ఆపుస్మా జిల్లా కార్యదర్శి పి.కళ్యాణ్‌రెడ్డి, ప్రముఖ చిత్రకారులు దామెర్ల రామారావు మనుమడు డేన్నిస్ దామెర్ల, స్వామి యాడ్స్ అధినేత జి.భాస్కర్, అమరావతి బాలోత్సవం ఆర్గనైజింగ్ కార్యదర్శి టి.క్రాంతికుమార్, గోదావరి బాలోత్సవం ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.తులసి, గోదావరి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి దాసరి సాయిబాబా, ఎస్‌టీఎఫ్‌ఐ జాతీయ కార్యదర్శి ఎన్.అరుణ కుమారి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎ.షరీఫ్, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘ అధ్యక్షుడు కోలా సత్యనారాయణ తదితరుల చేతుల మీదుగా విజేతలకు బహుమతుల ప్రదానం జరిగింది. కార్యక్రమంలో బాలోత్సవం ఆర్గనైజర్లు నవీన కుమారి, ఆనంద్, వినోద్, పట్నాయక్, మురళి, అంజలి, గొల్లపల్లి సత్యనారాయణ, బుద్ధా శ్రీనివాస్, విజయ్‌బాబు, రాజేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ అట్టహాసంగా ముగిసిన
బాలోత్సవం
ఫ అబ్బురపరిచిన చిన్నారుల
ప్రదర్శనలు
ఫ విజేతలకు బహుమతుల ప్రదానం
అదిరే.. కళ్లు చెదిరే..
అదిరే.. కళ్లు చెదిరే..


