విజయవంతంగా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

విజయవంతంగా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష

Dec 1 2025 9:40 AM | Updated on Dec 1 2025 9:40 AM

విజయవ

విజయవంతంగా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష

రామచంద్రపురం రూరల్‌: జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ద్రాక్షారామ జెడ్పీ హైస్కూల్‌ కేంద్రంగా ఆదివారం నిర్వహించిన ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా సైన్స్‌ అధికారి గిరజాల వెంకట సత్య సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ పరీక్షల్లో రామచంద్రపురం డివిజన్‌కు జిల్లా పరిషత్‌ తరఫున కన్వీనర్‌గా శనివారపు పాపాయి, కోఆర్డినేటర్‌లుగా గణేష్‌, రాజశేఖర్‌ వ్యవహరించారు. పరీక్ష రాసిన 2,600 విద్యార్థులకు సోమవారం ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేస్తామని గిరజాల తెలిపారు. కార్యక్రమంలో పీడీ ఆని శ్రీనివాస్‌, స్టాఫ్‌ సెక్రటరీ అరవ విస్సు, చోడి రమణ సహకారం అందించగా, జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

బీరు బాటిల్‌తో తల బద్దలు కొట్టుకుని...

అభిమాన హీరో ఫ్లెక్సీకి రక్త తిలకం

నిందితుడిపై కేసు నమోదు

అమలాపురం టౌన్‌: స్థానిక వెంకటరమణ థియేటర్‌లో శనివారం హీరో మహేష్‌బాబు నటించిన బిజినెస్‌మేన్‌ సినిమా రీ రిలీజ్‌ సందర్భంగా ఓ అభిమాని ప్రేక్షకులను భయబ్రాంతులకు గురి చేశాడు. దీంతో ఆ అభిమాని అయిన అయినవిల్లి మండలం నేదునూరు గ్రామానికి చెందిన కేతా వర్ధన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. మహేష్‌బాబుపై అభిమానంతో కేతా వర్ధన్‌ తన తలను బీరు బాటిల్‌తో కొట్టుకున్నాడు. తల నుంచి కారుతున్న రక్తంతో ఆ హీరో ఫొటో ఉన్న ఫ్లెక్సీపై వీర రక్త తిలకం దిద్దాడు. అంతటితో ఆగకుండా ఆ థియేటర్‌ వెలుపల రోడ్డుపై పెట్రోలు పోసి నిప్పు పెట్టాడు. ఆ మంటల నుంచి తన అభిమాన హీరోకి హారతి ఇచ్చాడు. అభిమాని వర్ధన్‌ చేస్తున్న పిచ్చి పనులను చూసిన ప్రేక్షకులు, అటుగా వెళుతున్న ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాడని సీఐ వీరబాబు తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకున్నామని అన్నారు.

రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్‌లో చాంపియన్‌గా ‘తూర్పు’

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన అండర్‌–14, 17 రాష్ట్ర స్థాయి అంతర్‌ జిల్లాల రోలర్‌ స్కేటింగ్‌ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఇందులో రాష్ట్ర స్థాయి చాంపియన్‌ షిప్‌ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జట్టు కై వసం చేసుకుంది. పోటీల ముగింపు ఉత్సవానికి ఎమ్మెల్సీ పద్మశ్రీ, టీచర్స్‌ ఎమ్మెల్సీ మూర్తి, కోకనాడ కోస్టల్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ ప్రతినిధి రవిచంద్ర ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఎస్‌జీఎఫ్‌ఐ అడ్మిన్‌ కార్యదర్శి సుధారాణి మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 10 జిల్లాల నుంచి 400 మంది హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శి శ్రీనివాస్‌, డీఎస్‌ఏ జిమ్నాస్టిక్స్‌ కోచ్‌ సురేష్‌, పీడీ ప్రసాద్‌, వ్యాయామ ఉపాధ్యాయ సంఘ కార్యదర్శి మాచరరావు, సీనియర్‌ పీడీలు జార్జి, రవిరాజు, జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌ క్రీడాకారిణి యాసిన్‌, సంఘ కార్యదర్శి విఠల్‌ పాల్గొన్నారు.

విజయవంతంగా  ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష 1
1/1

విజయవంతంగా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement