వెండితో సూక్ష్మ ప్రెషర్ కుక్కర్
అమలాపురానికి చెందిన స్వర్ణకారుడు తాళాబత్తుల బ్రహ్మాజీ వెండితో సూక్ష్మ ప్రెషర్ కుక్కర్‌ను రూపొందించారు. ఈ సూక్ష్మ డబుల్ డెక్కర్ ప్రెషర్ కుక్కర్‌ను కేవలం 4 సెంటీ మీటర్ల పొడవు, 2 సెంటీమీటర్ల వెడల్పు, 20 గ్రాముల బరువుతో దీన్ని తయారు చేశారు. కుక్కర్‌తోపాటు రెండు అతి చిన్న స్పూన్లు, రెండు రబ్బర్ గ్యాస్ కట్లు రూపొందించారు. దీని తయారీకి పది రోజులు పట్టిందని బ్రహ్మాజీ తెలిపారు. ఈయన గతంలో బంగారం, వెండితో 36 సూక్ష్మ వస్తువులు తయారు చేసి మినియేచర్ వరల్డ్ రికార్డు హోల్డర్‌గా గుర్తింపు పొందారు.
– అమలాపురం టౌన్


