కారు చోరీ
కాజులూరు: గొల్లపాలెంలో కారు చోరీకి గురైనట్టు ఎస్సై ఎం.మోహన్‌కుమార్ తెలిపారు. శనివారం పోలీస్ స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామంలోని పెద్దవీధికి చెందిన నేతి భగవాన్ ఇంట్లో శుక్రవారం రాత్రి ఈ చోరీ జరిగిందన్నారు. దొంగలు గేటు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి హుందాయ్ వెన్యూ కారును దొంగిలించుకుపోయారని చెప్పారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
కాకినాడ క్రైం: వ్యక్తిగత కారణాలతో కాకినాడకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే, కాకినాడ బుడంపేటకు చెందిన దొడ్డిపాటి రాఘవ(53) శుక్రవారం ఇంట్లో ఉన్న పలురకాల మాత్రలు మింగాడు. కుటుంబ సభ్యులు కాకినాడ జీజీహెచ్‌లో చేర్చగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఘటనపై కాకినాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.


