క్రికెట్ ట్రోఫీకి శ్రీప్రకాష్ విద్యార్థులు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ప్రతిష్టాత్మకమైన బీసీసీఐ విజయ్ మర్పంట్ క్రికెట్ ట్రోఫీకి అండర్–16 విభాగంలో కాకినాడ శ్రీప్రకాష్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఆ పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయ్ ప్రకాష్ గురువారం తెలిపారు. పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న జి.లక్ష్మీగౌతమ్, 10వ తరగతి విద్యార్థి కె.తమన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. తమ పాఠశాలలో చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామనడానికి ఇదే నిదర్శమని తెలిపారు. భవిష్యత్తులో తమ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ఎంపికై రాణించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఎంపికై న విద్యార్థులను, కోచ్ దుర్గాప్రసాద్‌ను జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు తలాటం హరిష్, కార్యదర్శి నక్కా వెంకటేష్, శ్రీప్రకాష్ విద్యాసంస్థల జాయింట్ సెక్రటరీ సమీరా అభినందించి, మెమెంటోలతో సత్కరించారు.


