స్వామి రథోత్సవం.. అంగరంగ వైభవం
● బిక్కవోలులో విహరించిన
సుబ్రహ్మణ్యస్వామి
● భారీగా తరలివచ్చిన భక్తులు
బిక్కవోలు: సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాల్లో భాగంగా గురువారం బిక్కవోలులో కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీపై ఆలయ ప్రాంగణంలో ఉరేగించారు. అనంతరం రథంపై స్వామిని ఆశీనులు చేసి రథోత్సవం నిర్వహించారు. బ్యాండ్ మేళాలు, కోలాటాలు, డోలు సన్నాయి వాయిద్యాలు, కేరళ వాయ్యిదాలు, భారీ భక్త జన సందోహం మధ్య ఈ కార్యక్రమం జరిగింది. రథోత్సవాన్ని ఉత్సవ కమిటీ చైర్మన్ పల్లె శ్రీనివాసరెడ్డి (వాసు) ప్రారంభించారు. ఆలయం నుంచి జి.మామిడాడ రోడ్డు మీదుగా వెళ్లి తిరిగి గ్రామంలోని ప్రధాన రోడ్ల మీదుగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సుమారు వంద మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యుడు పాలచర్ల చిట్టిబాబు చౌదరి, ఆలయం ఈవో రామలింగ భాస్కర్, సీఐ సుమంత్, ఎస్సై వాసంశెట్టి రవిచంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
స్వామి రథోత్సవం.. అంగరంగ వైభవం
స్వామి రథోత్సవం.. అంగరంగ వైభవం


