బాలిక అదృశ్యం
పెరవలి: మండలంలోని ఖండవల్లి గ్రామానికి చెందిన ఉమ్మిడి గంగధరరావు చిన్న కుమార్తె రమశ్రీ సత్య నాగలక్ష్మి (17) ఈ నెల 26న అదృశ్యమైంది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఆ బాలిక ఆ రోజు ఉదయం నుంచి ఇంట్లోనే ఉందని, మధ్యాహ్నం 2 గంటలకు ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందన్నారు. ఆచూకీ తెలిసినవారు 94407 96642కు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.
డిసెంబర్‌లో ‘నన్నయ’లో
బెస్ట్ ఫిజిక్ పోటీలు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ స్పోర్ట్సు బోర్డు ఆధ్వర్యంలో డిసెంబర్ 27 నుంచి 30 వరకూ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ మెన్ ఛాంపియన్ షిప్ జరగనుందని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. ఈ కార్యక్రమ బ్రోచర్‌ను గురువారం విడుదల చేశారు. పోటీలకు హాజరయ్యే వారందరూ 15 లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, అసోసియేట్ సెక్రటరీ డాక్టర్ ఎంవీఎస్‌ఎస్ మూర్తి, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఇద్దరు జీవిత ఖైదీల విడుదల
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు జీవిత ఖైదీలు విడుదలయ్యారు. ఈ మేరకు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ గురువారం ఆ వివరాలు తెలిపారు. బిక్కవోలు మండలం కొమరిపాలేనికి చెందిన కటికిరెడ్డి నాగేశ్వరరావు హత్య కేసులో 2011 మార్చిలో జైలుకు వచ్చాడు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం చంద్రాలకు చెందిన మద్దూరి సువర్ణరాజు భార్యను చంపిన కేసులో 2010 లో జైలుకు వచ్చారు. వీరిని ప్రభుత్వ జీవోను అనుసరించి విడుదల చేశారు.
బాలిక అదృశ్యం


