రాష్ట్రంలో అమలు కాని అంబేడ్కర్‌ రాజ్యాంగం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అమలు కాని అంబేడ్కర్‌ రాజ్యాంగం

Nov 27 2025 6:29 AM | Updated on Nov 27 2025 6:29 AM

రాష్ట్రంలో అమలు కాని అంబేడ్కర్‌ రాజ్యాంగం

రాష్ట్రంలో అమలు కాని అంబేడ్కర్‌ రాజ్యాంగం

లోకేష్‌ రెడ్‌బుక్‌ పాలనతో అస్తవ్యస్తం

రాజ్యాంగ దినోత్సవంలో మాజీ మంత్రి వేణు

అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళి

రాజమహేంద్రవరం రూరల్‌: ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని మనకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అందించారని, కానీ రాష్ట్రంలో అది అమలు కావడం లేదని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం బొమ్మూరులోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ రాజ్యాంగం అందరికీ హక్కులు, స్వేచ్ఛను కల్పించిందన్నారు. ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం ద్వారా సమానతను చేరువ చేసిన ఘనత ఒక్క అంబేడ్కర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని, లోకేష్‌ రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలవుతోందన్నారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో పోలీసుశాఖ పనితీరు ద్వితీయ, తృతీయస్థానంలో ఉండేదని, ప్రస్తుతం ప్రభుత్వ పాలనలో అథమ స్థానానికి పడిపోయిందన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు సర్కారు ప్రతిపక్ష నేతలపై వేధింపులు మాని, పాలనపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి విప్పర్తి ఫణికుమార్‌, పార్టీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చాపా రాజ, జిల్లా మైనార్టీ సెల్‌ అధికార ప్రతినిధి షట్టర్‌ బాషా, జిల్లా యువజన విభాగం కార్యదర్శి అప్పా పరిమళ కుమార్‌ (నాని), మండల యువజన విభాగం అధ్యక్షుడు కొల్లి వెంకటరత్నం (నాని), తోడేటి రాహుల్‌, జాలా మోషే, మేడిశెట్టి టింకు, వాసంశెట్టి శ్రీనివాస్‌, పట్టా ఉత్తేజ్‌, తాడిపూడి విజయరాజు, కొల్లి నాని, మెరుగొల్ల చిన్నబాబు, చెల్లుబోయిన నరేష్‌, మధుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement