పాల కావడి.. భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

పాల కావడి.. భక్తుల సందడి

Nov 26 2025 6:47 AM | Updated on Nov 26 2025 6:47 AM

పాల క

పాల కావడి.. భక్తుల సందడి

కావడి ఉత్సవంలో 216 కలశాలతో ఊరేగింపు

కావడి ఉత్సవం చేస్తున్న స్వాములు

బిక్కవోలు: మండలంలోని కొమరిపాలెంలో పవిత్ర తుల్యభాగ నది తీరాన నెమలి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాల కావడి ఉత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. షష్ఠి ఉత్సవాలను పురస్కరించుకుని ద్రవిడ విధానంలో పళని సంస్కృతి ప్రకారం షష్ఠి ముందు రోజున 108 మంది భక్తులు మురుగన్‌ మాలధారణ చేశసి, పాల కావళ్లతో గ్రామోత్సవం చేశారు. దీనిలో భాగంగా 216 కలశాలతో గోదావరి జలాలను బిందెలతో తెచ్చి స్వామి వారికి అభిషేకం చేశారు. గరగ నృత్యాలు, తీన్‌మార్‌ డప్పులు, మురుగన్‌ నృత్యాలతో ఈ ఉత్సవాన్ని ఆద్యంతం కోలాహలంగా నిర్వహించారు. అనంతరం మురుగన్‌ మాలధారులు స్వామివారి ఉత్సవ మూర్తిని గ్రామంలో ఊరేగించారు. కార్యక్రమంలో గురుస్వామిలు కర్రి భీమారెడ్డి, సత్తి గంగిరెడ్డి, కొవ్వూరి అబ్బాయిరెడ్డి, బలరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

పాల కావడి.. భక్తుల సందడి1
1/1

పాల కావడి.. భక్తుల సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement