ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం

Nov 26 2025 6:43 AM | Updated on Nov 26 2025 6:45 AM

క్షేత్రస్థాయి నుంచి యువజన విభాగం

బలోపేతమే లక్ష్యం

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర

అధ్యక్షుడు జక్కంపూడి

తణుకులో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం విస్తృత స్థాయి సమావేశం

సాక్షి, భీమవరం: చంద్రబాబు సర్కారు అరాచక పాలనపై వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రజల పక్షాన పోరాటాలు, ఉద్యమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. ఆ దిశగా భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు. వైఎస్సార్‌ సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జల్లాల యువజన విభాగం విస్తృత స్థాయి సమావేశం పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని పద్మశ్రీ ఫంక్షన్‌్‌ హాలులో మంగళవారం జరిగింది. యువజన విభాగం పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్‌ అధ్యక్షతన జరిగిన సభలో యువజన విభాగం సంస్థాగతంగా బలోపేతానికి, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని రాజా సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యం ఏదోరకంగా ప్రజలను మోసగించడం, మభ్యపెట్టడం సీఎం చంద్రబాబు నైజమన్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి సూపర్‌ సిక్స్‌ పేరిట ఓట్లు దండుకుని ప్రజలకు మొండిచేయి చూపించారన్నారు. ఏడాదిన్నరైనా ఇంటికో ఉద్యోగం, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి వాగ్దానాల ఊసే లేదన్నారు. అసెంబ్లీలో వాటి గురించి ప్రస్తావన గాని, బడ్జెట్‌లో కేటాయింపులు గాని లేవన్నారు.

రైతులు, మహిళలు, యువతను మోసం చేశారు

యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు కారుమూరి సునీల్‌ మాట్లాడుతూ రైతులు, మహిళలు, యువతను ఈ ప్రభుత్వం మోసగించిందన్నారు. తల్లికి వందనం అరకొరగా ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అటకెక్కించారని, ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టారని విమర్శించారు. 17 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ యువతకు ఇవ్వలేదన్నారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఎస్‌ఈసీ సభ్యుడు కొట్టు నాగేంద్ర, యువజన విభాగం ఏలూరు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల అధ్యక్షులు కామిరెడ్డి నాని, పిల్లి సూర్యప్రకాష్‌, కంటమనేని రమేష్‌, రాగిరెడ్డి అరుణకుమార్‌, సంచార జాతుల కార్పొరేషనన్‌ మాజీ చైర్మనన్‌ పెండ్ర వీరన్న, ఐదు జిల్లాల్లోని యువజన విభాగం నియోజకవర్గ, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.

ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం1
1/2

ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం

ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం2
2/2

ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement