యువజనోత్సాహం | - | Sakshi
Sakshi News home page

యువజనోత్సాహం

Nov 26 2025 6:43 AM | Updated on Nov 26 2025 6:43 AM

యువజన

యువజనోత్సాహం

సాక్షి, భీమవరం/ తణుకు అర్బన్‌: తణుకు వేదికగా జరిగిన వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం సమావేశంలో ఉత్సాహం ఉరకలు వేసింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి తరలివచ్చిన యువ నేతలతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. క్షేత్ర స్థాయి నుంచి సంస్థాగతంగా పూర్తి స్థాయిలో యువజన విభాగం బలోపేతానికి, పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగనన్‌మోహన్‌న్‌రెడ్డి పిలుపు మేరకు కార్యక్రమాల విజయవంతానికి భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు.

సంస్థాగతంగా బలోపేతం : జక్కంపూడి రాజా

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగాన్ని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో క్రియాశీలక యువజన నాయకులతో పార్టీ అభివద్ధికి కృషి చేస్తాం. కమిటీల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న తప్పులపై పోరాటాలు, ఉద్యమాలకు యువత సిద్ధంగా ఉన్నారు.

అన్ని వర్గాలను మోసం చేశారు : కారుమూరి సునీల్‌

రైతులు, మహిళలు, యువత, అన్ని వర్గాలను చంద్రబాబు ప్రభుత్వం మోసం ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామన్నారు. ఏడాది కావస్తున్నా అసెంబ్లీల్లో ప్రస్తావన గానీ, బడ్జెట్లో కేటాయింపులు గానీ చేయలేదు. అబద్ధపు హామీలతో పబ్బం గడుపుకుంటున్న కూటమి నేతలకు గుణపాఠం చెప్పేందుకు యువత ఎదురుచూస్తోంది.

యువత పాత్ర కీలకం: కారుమూరి నాగేశ్వరరావు

మన నాయకుడు జగనన్‌ మాట ఇస్తే తప్పే మనిషి కాదు. పార్టీలో యువతకే ప్రాధాన్యం కల్పిస్తారు. దోచుకో.. దాచుకో అన్నట్టుగా చంద్రబాబు పాలన ఉంది. అప్పుడు జగనన్‌ సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల మార్కెట్‌లో వ్యాపారాలు జరిగేవి. జగన్‌ లేకపోవడంతో వ్యాపారులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు మళ్లీ వడ్డీలు తెచ్చుకునే పరిస్థితికి వచ్చేశారు.

యువతను మభ్యపెట్టారు : ముదునూరి మురళీ కృష్ణంరాజు

యువతను మభ్యపెట్టి కూటమి అధికారంలోకి వచ్చింది. 20 లక్షలు ఉద్యోగాలు, రూ.3 వేల నిరుద్యోగ భృతి అని హామీలు ఇచ్చి చంద్రబాబు యువతను మోసం చేశారు. జగనన్‌మోహన్‌్‌రెడ్డి పిలుపునందుకుని అన్ని ఉద్యమాల్లో యువత ఉత్సాహంగా పాల్గొంటోంది. మళ్లీ జగనన్‌మోహన్‌న్‌రెడ్డి అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయి.

యువశక్తితో ఏదైనా సాధ్యం: ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌

యువత తలుచుకుంటే ప్రభుత్వాలను కూల్చగలరు, అధికారంలోకి తీసుకురాగలరు. 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం, అరెస్ట్‌లు చేయడం పరిపాటిగా మారింది. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షనన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. యువతంతా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి.

యువత కష్టపడి పనిచేయాలి: కొట్టు నాగేంద్ర, సీఈసీ సభ్యుడు

యువత దశ, దిశగా మారి పార్టీని బలోపేతం చేయాలి. 2029లో జగన్‌న్‌మోహన్‌న్‌రెడ్డి మళ్లీ సీఎం అవ్వడానికి యువత కష్టపడి పార్టీ కోసం పనిచేయాలి. ఏడాదిన్నరలో ఏ పథకం కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు. వితంతు పెన్షన్లు ఒక్కటి కూడా ఇవ్వలేదు. పార్టీ కష్టకాలంలో బాగా పనిచేసి 2029 ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలి.

యువజనోత్సాహం  1
1/5

యువజనోత్సాహం

యువజనోత్సాహం  2
2/5

యువజనోత్సాహం

యువజనోత్సాహం  3
3/5

యువజనోత్సాహం

యువజనోత్సాహం  4
4/5

యువజనోత్సాహం

యువజనోత్సాహం  5
5/5

యువజనోత్సాహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement