ఉమ్మడి ఏపీ డ్రగ్స్‌ డైరెక్టర్‌ వెంకటరెడ్డి ఆకస్మిక మృతి | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి ఏపీ డ్రగ్స్‌ డైరెక్టర్‌ వెంకటరెడ్డి ఆకస్మిక మృతి

Nov 26 2025 6:43 AM | Updated on Nov 26 2025 6:43 AM

ఉమ్మడి ఏపీ డ్రగ్స్‌ డైరెక్టర్‌ వెంకటరెడ్డి ఆకస్మిక మృతి

ఉమ్మడి ఏపీ డ్రగ్స్‌ డైరెక్టర్‌ వెంకటరెడ్డి ఆకస్మిక మృతి

అనపర్తి: ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ డ్రగ్స్‌ డైరెక్టర్‌ మండ వెంకటరెడ్డి(79) ఆదివారం ఆకస్మికంగా మృతి చెందారు. అనపర్తి వాసి అయిన వెంకటరెడ్డి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. డ్రగ్‌ ఇనస్పెక్టర్‌గా నిబద్ధతతో పని చేస్తూ అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగిన ఆయన ఉమ్మడి ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌ అధ్యక్షుడిగాను పని చేశారు.

ఆధ్యాత్మిక సేవల్లో భాగంగా సత్యసాయి సేవాసంస్థలు రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. వెంకటరెడ్డి మృతి పట్ల అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, వైఎస్సార్‌ సీపీ అనపర్తి మండల కన్వీనర్‌ సత్తి రామకృష్ణారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement