నారు.. గిరాకీ జోరు | - | Sakshi
Sakshi News home page

నారు.. గిరాకీ జోరు

Nov 26 2025 6:17 AM | Updated on Nov 26 2025 6:17 AM

నారు.

నారు.. గిరాకీ జోరు

ధర బాగుంది

నారుకు కొరత ఎక్కువగా ఉండడంతో డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ధర బాగుంది. మొన్నటి వరకూ ఎకరం విస్తీర్ణంలో నాటడానికి అవసరమైన 6 వేల మొక్కల ధర రూ.7 వేలు ఉంది. ప్రస్తుతం అది రూ.12 వేల నుంచి రూ.14 వేలు పలుకుతోంది. మడిలో నారు రూ.8 వేలు పలుకుతోంది. నాట్లు ఆలస్యంగా మొదలవడంతో నారుకు డిమాండ్‌ ఏర్పడింది. ఎక్కువగా ట్రే నారు నాట్లు వేస్తున్నారు. మూడేళ్లుగా నారు వ్యాపారం లాభసాటిగా ఉంది. ఎకరాకు సుమారు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల ఆదాయం వస్తోంది.

– వల్లభనేని సత్యనారాయణ, రైతు,

వెదుళ్లకుంట, గోపాలపురం మండలం

ఎకరం నారు రూ.14 వేలు

మడి నారు రూ.8 వేలు

ఎకరానికి రూ.10 లక్షల ఆదాయం

ఊపందుకున్న పొగాకు నాట్లు

దేవరపల్లి: మెట్ట ప్రాంతంలో వర్జీనియా పొగాకు నాట్లు ఊపందుకోవడంతో నారుకు గిరాకీ పెరిగింది. ఇరవై రోజుల నుంచి పొగాకు సాగు ముమ్మరంగా జరుగుతోంది. ఈ ఏడాది 20 నుంచి 30 రోజులు పొగాకు నాట్లు ఆలస్యంగా ప్రారంభం కావడంతో మడుల్లోని నారు తీయలేదు. దీంతో, మొక్కల కింద ఉన్న చిన్న మొక్కలు గాలి, వెలుతురు అందక, ఎదుగుదల లేక అణగారిపోయాయని నారుమడుల రైతులు తెలిపారు. ఒక్కసారిగా నాట్లు ప్రారంభం కావడంతో మడుల్లోని నారు ముదర అయిపోవడంతో లేత నారుకు కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఉన్న నారుకు డిమాండ్‌ ఏర్పడింది. ఈ ఏడాది మడి నారు ఎకరం (6 వేల మొక్కలు) రూ.3,500 నుంచి 5 వేలు పలకగా, ట్రే నారు రూ.8 వేల నుంచి రూ.10 వేలు పలికింది. ట్రే నారు ఆరోగ్యకరంగా, మాను దృఢంగా ఉండటంతో ఎక్కువ మంది రైతులు ట్రే నారు కొనుగోలు చేసి, నాట్లు వేశారు. మడుల్లో నారు దాదాపు పూర్తి కాగా, ట్రే నారు రైతుల వద్ద సిద్ధంగా ఉంది. నారు కొరత ఏర్పడటంతో ధర రెట్టింపు పలుకుతోంది. ప్రస్తుతం మడి నారు ఎకరం రూ.6 వేల నుంచి రూ.8 వేలు, ట్రే నారు రూ.12 వేల నుంచి రూ.14 వేలు పలుకుతోంది. ఈ ధర మున్ముందు మరింత పెరుగుతుందని రైతులు అంటున్నారు. నారు వ్యాపారులకు ఈ ఏడాది మంచి లాభాలు వచ్చాయి. ఎకరం విస్తీర్ణంలో నారుమడి కట్టిన రైతుకు సుమారు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం వచ్చినట్టు సమాచారం. ఎకరం నారుకు 2023 సీజన్‌లో రూ.18 వేలు, 2024 సీజన్‌లో రూ.16 వేలు చొప్పున ధర పలికింది. గత రెండేళ్లూ నారుమడులు కట్టిన రైతులకు ఊహించని లాభాలు వచ్చాయి. ఈ ఏడాది పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో సుమారు 285 హెక్టార్లలో నారుమడులు వేశారు. రీజియన్‌ పరిధిలో సుమారు లక్ష ఎకరాల్లో పొగాకు సాగుకు రైతులు సన్నద్ధం కావడంతో నారుకు కొరత ఏర్పడినట్టు రైతు సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఎకరం రూ.70 వేల చొప్పున రైతులు కౌలుకు తీసుకుని నారుమడులు కట్టారు. కిలో విత్తనాలు రూ.25 వేలకు కొనుగోలు చేశారు. ఎకరం విస్తీర్ణంలో నారుమడుల సాగుకు సుమారు రూ.3 లక్షల ఖర్చవుతోందని రైతులు తెలిపారు. దేవరపల్లి మండలం దేవరపల్లి, పల్లంట్ల, లక్ష్మీపురం, సంగాయగూడెం, చిన్నాయగూడెం, బందపురం గ్రామాల్లో ఎక్కువ విస్తీర్ణంలో పొగాకు నర్సరీలు వేశారు. వ్యాపారులు మడుల్లోను, పంట సాగు చేసే పెద్ద రైతులు ట్రేలలోను నారు పెంచారు.

నారు.. గిరాకీ జోరు1
1/2

నారు.. గిరాకీ జోరు

నారు.. గిరాకీ జోరు2
2/2

నారు.. గిరాకీ జోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement