పెళ్లింట కనువిందు!
డూడూ బసవన్నలు
సింహద్వారం వద్ద రడీమేడ్ అరటి గెలలు
వయ్యారాలు పోతున్న
పల్లెటూరు యువతి
తిరగలి తిప్పుతున్న పల్లె పడుచు
ట్రెండుకు అనుగుణంగా యువత ఆలోచనల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జీవితంలో ఒకసారి జరిగే వివాహ వేడుక చిరస్థాయిగా గుర్తుండిపోయేలా భారీ సెట్టింగులు ఏర్పాటు చేసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పెదపట్నంలంకలో కొమ్ముల వారి మన మండువాలో సోమవారం రాత్రి పెళ్లి వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత్‌లో పలు రకాల బొమ్మలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కోనసీమ కొబ్బరాకు పందిళ్లు, అరటి బొందలతో ఏర్పాటు చేసిన స్వాగత ద్వారాలకు ఈ బొమ్మలు తోడయ్యాయి. డూడూ బసవన్నలు, ఆవు, దూడ, కాళీయ మర్దనం, తిరగలి వద్ద కూర్చుని తిప్పుతున్న పల్లె పడుచు, డోలు, సన్నాయి వాయిస్తున్న వాద్యకారులు, బిందెతో వయ్యారాలు పోతూ కూర్చున్న పల్లె పడుచు బొమ్మలు రంజింపజేశాయి. మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుకు తెచ్చాయి. అతిథులు ఆసక్తిగా వీటిని తిలకించారు. వాటి వద్ద నిల్చుని సెల్ఫీలు, ఫొటోలు తీయించుకున్నారు.
– మామిడికుదురు
పెళ్లింట కనువిందు!
పెళ్లింట కనువిందు!
పెళ్లింట కనువిందు!
పెళ్లింట కనువిందు!
పెళ్లింట కనువిందు!


