కాకినాడలో లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ లక్కీ షాపింగ్ మాల్ తన నూతన బ్రాంచ్‌ను కాకినాడ మెయిన్‌రోడ్డులో సోమవారం ప్రారంభించింది. సినీ తారలు ఓజీ ఫ్రేమ్ నటి ప్రియాంక మోహన్, యాంకర్, సినీనటి అనసూయ, జబర్దస్ నటుడు హైపర్ ఆది షాపును ప్రారంభించారు. ఎమ్మెల్యే వనమాడి వేంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు రాజశేఖర్, గ్రంధిబాబ్జి పాల్గొన్నారు. షోరూమ్ ప్రతినిధులు శ్రీను, రత్తయ్య, స్వామి మాట్లాడుతూ కాకినాడలో తమ బ్రాంచ్‌ను పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాలుగు అంతస్తుల్లో ఏర్పాటు చేశామన్నారు. కిడ్స్, మెన్, ఉమెన్‌కు సంబంధించిన వస్త్రాలతో పాటు పెళ్లి వేడుకలకు కావాల్సిన అన్ని రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని రకాల వస్త్రాలపై ఆఫర్లు ఇస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కాకినాడలో లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభం
కాకినాడలో లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభం


