సాఫ్ట్‌బాల్‌లో ఉమ్మడి తూర్పునకు ద్వితీయ స్థానం
ఐ.పోలవరం: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ నెల 22 నుంచి 24 వరకు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఈ పోటీలు జరిగాయి. అండర్– 14 సాఫ్ట్‌బాల్ బాలబాలికల పోటీలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రెండు జట్లు ద్వితీయ స్థానంలో నిలిచాయి. ఈ టోర్నమెంట్ ప్రారంభం నుంచే ఇరు జట్లు ఉత్తమ ప్రతిభ కనబరిచాయి. ఈ జట్లలో జి.వేమవరం ఉన్నత పాఠశాలకు చెందిన బాలురు ఆరుగురు, బాలికలు ఏడుగురు జట్టు విజయం సాధించడంలో ప్రధాన భూమిక పోషించారు. బాలికల విభాగం నుంచి జి.వేమవరం పాఠశాల చెందిన ఎం బాబు బెస్ట్ పిక్చర్ గాను, మద్దింశెట్టి బాల ఆదిత్య బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా, బాలికల విభాగం నుంచి ఎం.ఝాన్సీ శ్రీ బెస్ట్ క్యాచర్‌గా అవార్డు అందుకున్నారు. రెండు జట్లలో స్థానిక క్రీడాకారులను సోమవారం స్థానిక పాఠశాలలో పాఠశాల హెచ్‌ఎం వారణాసి సుభద్ర లక్ష్మీదేవి, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ బసవ అప్పారావు, సర్పంచ్ నల్లా సుదర్శన్‌రావు సత్కరించారు. ఇరు జట్లకు కోచ్, మేనేజర్‌గా వ్యవహరించిన ఎం.నాగ రాంప్రసాద్, జి.సునీల్ కుమార్, జి.కళావతిలను పలువరు అభినందించారు.
సాఫ్ట్‌బాల్‌లో ఉమ్మడి తూర్పునకు ద్వితీయ స్థానం


