జాతీయ బాస్కెట్‌బాల్ పోటీలకు ఛరిష్మా
అమలాపురం టౌన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) 69వ ఈవెంట్‌గా నిర్వహిస్తున్న జాతీయ బాస్కెట్ పోటీలకు అంబాజీపేటకు చెందిన విద్యార్థిని నిమ్మకాయల ఛరిష్మా సాయి రుత్విక ఎంపికై ంది. అమలాపురంలోని శ్రీవాగ్దేవి స్కూలులో పదో తరగతి చదువుతున్న ఛరిష్మా బాస్కెట్‌బాల్ రాష్ట్ర బాలికల జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. ఇటీవల ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన అంతర జిల్లాల బాస్కెట్ బాల్ పోటీల్లో ఛర్మిషా ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టులో స్థానం సాధించింది. వచ్చే నెల మొదటి వారంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాజ్‌నంద్‌గామ్‌లో జరుగనున్న జాతీయ పోటీల్లో ఛర్మిషా జిల్లా జట్టుతో తలపడనుంది. సోమవారం సాయంత్రం స్కూలులో జరిగిన అభినందన సభలో విద్యార్థిని ఛర్మిషాను స్కూలు డైరెక్టర్ పరసా భరత్, ప్రిన్సిపాల్ డాక్టర్ శిష్టి శ్రీరామచంద్రమూర్తి, హెచ్‌ఎం పిచ్చిక సుబ్రహ్మణ్యం, పీఈటీ రాజేష్, ఇతర ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ప్రశంసించారు. జాతీయ బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపికై న ఛరిష్మా ఆ పోటీల్లో కూడా విజేతగా నిలిచి తమ స్కూలుకు, జిల్లాకు పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.


