అదనపు ఏర్పాట్లు లేకుండా ‘సీ్త్ర శక్తి’ అమలు సరికాదు | - | Sakshi
Sakshi News home page

అదనపు ఏర్పాట్లు లేకుండా ‘సీ్త్ర శక్తి’ అమలు సరికాదు

Nov 25 2025 10:12 AM | Updated on Nov 25 2025 10:12 AM

అదనపు ఏర్పాట్లు లేకుండా ‘సీ్త్ర శక్తి’ అమలు సరికాదు

అదనపు ఏర్పాట్లు లేకుండా ‘సీ్త్ర శక్తి’ అమలు సరికాదు

రాజమహేంద్రవరం సిటీ: అదనపు ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం సీ్త్ర శక్తి పథకంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని యునైటెడ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఏఎస్‌ నారాయణ, ప్రధాన కార్యదర్శి కేఎస్‌పీ రావు అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో వద్ద రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీ్త్ర శక్తి పథకం అమలుతో జరుగుతున్న జాప్యానికి ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతూ విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడులకు దిగుతున్నారని, ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం బస్సుల్లో 70 మందిని మాత్రమే అనుమతించేలా నిబంధనలు మార్చాలన్నారు. విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడి చేస్తే హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. దాడికి గురైన సిబ్బంది తిరిగి విధుల్లో చేరే వరకూ ఆన్‌ డ్యూటీగా పరిగణించాలని, తక్షణం కార్పొరేట్‌ వైద్యం చేయించాలని డిమాండ్‌ చేశారు. బస్సులను ఏమాత్రం పెంచకుండా సీ్త్ర శక్తి పథకం అమలు చేయడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. తక్షణం బస్సుల సంఖ్యను పెంచి, చెకింగ్‌ విధానంలో మార్పులు తేవాలని వారు అన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ డిపో కార్యదర్శి బీఆర్‌కే కుమారి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement