అర్జీల పరిష్కారానికి వ్యక్తిగత బాధ్యత వహించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారానికి వ్యక్తిగత బాధ్యత వహించాలి

Nov 25 2025 10:12 AM | Updated on Nov 25 2025 10:12 AM

అర్జీ

అర్జీల పరిష్కారానికి వ్యక్తిగత బాధ్యత వహించాలి

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)లో వస్తున్న అర్జీల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని, సమస్యలను నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కరించాలని కలెక్టర్‌ కీర్తి చేకూరి ఆదేశించారు. కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ హాలులో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ప్రజల నుంచి ఆమె, ఇతర అధికారులు 200కు పైగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజలు చేసిన ప్రతి ఫిర్యాదుపై స్పష్టమైన విచారణ జరిపి, తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, అభివృద్ధి, హౌసింగ్‌, సంక్షేమ శాఖలకు చెందిన ఐదుగురు ముఖ్య అధికారులతో పలు సమస్యలపై కలెక్టర్‌ సమీక్షించారు. హౌసింగ్‌ సర్వే పురోగతి, భూ రికార్డుల శుద్ధి, రెవెన్యూ వివాదాల పరిష్కారం, ప్రజలకు పారదర్శక సేవల అందుబాటుపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులకు అవసరమైన నిధుల మంజూరుకు సంబంధిత శాఖలు వెంటనే ఆయా ముఖ్య కార్యాలయాలకు ప్రతిపాదనలు పంపించాలని అన్నారు.

వచ్చే నెలలో భారతీయ

భాషలపై వర్క్‌షాప్‌

రాజానగరం: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో భారతీయ భాషలపై వచ్చే నెల 8, 9 తేదీల్లో వర్క్‌షాప్‌ జరుగనుంది. దీనికి ముఖ్య అతిథిగా మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హాజరు కానున్నారని వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని భారతీయ భాషా సమితి మినిస్ట్రీస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (న్యూఢిల్లీ) సహకారంతో నిర్వహించనున్నారు. దీనికి కోఆర్డినేటర్‌గా తెలుగు విభాగం అధ్యాపకుడు డాక్టర్‌ తలారి వాసు వ్యవహరిస్తారు. రిజిస్టార్‌ ఆచార్య కేవీ స్వామి తదితరులు పాల్గొన్నారు.

అర్జీల పరిష్కారానికి వ్యక్తిగత బాధ్యత వహించాలి 1
1/1

అర్జీల పరిష్కారానికి వ్యక్తిగత బాధ్యత వహించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement