పౌరాణిక, జానపద పాత్రలు నా డ్రీమ్ రోల్స్
మామిడికుదురు: ‘పౌరాణిక, జానపద పాత్రలు నా డ్రీమ్ రోల్స్’ అని ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల పేర్కొన్నారు. ‘రాజి’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆయన శనివారం పెదపట్నంలంకలో మాట్లాడుతూ తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర’, రామ్‌పోతినేని నటించిన ‘ఆంధ్రాకింగ్’, ‘మహేంద్ర గిరి వారాహి’, ‘తెరచాప’ చితాల్లో నటించానన్నారు. జూనియర్ ఎన్‌టీఆర్ చిత్రం ‘డ్రాగన్’ జనవరిలో షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఇంతవరకు 225 చిత్రాల్లో నటించానన్నారు. స్టూడెంట్ నెంబర్–1, సూర్యపుత్రులు, రామబంటు, సై, విక్రమార్కుడు, జనతా గ్యారేజ్, లిటిల్ హార్ట్స్ వంటి చిత్రాలు తనకు గొప్ప క్రేజ్‌ను తెచ్చాయన్నారు.


