
రైతులను నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం
● అందుబాటులో లేని యూరియా
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు,
మాజీ మంత్రి వేణు
రాజమహేంద్రవరం రూరల్: కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, అవసరమైన యూరియా అందుబాటులో లేకుండా చేసిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బాబు హామీలు ఆకాశమే హద్దుగా ఇస్తారని, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు మొదటి సంవత్సరం ఎత్తివేసి రెండో సంవత్సరం నుంచి ఇస్తున్నారని, 18 సంవత్సరాల నుంచి 59సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని, దానిని పీ 4పథకంలో కలిపామని చెబుతున్నారన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం పెద్ద మోసమన్నారు. పెద్దాపురం సభలో చంద్రబాబు రైతుల గురించి ఏమైనా మాట్లాడతారని అనుకుంటే వారి ఊసేలేదన్నారు. రైతు ప్రీమి యం కట్టకుండానే క్రాఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చిన ఘనత మాజీ సీఎం జగన్‌ది అన్నారు. కూటమి ఎమ్మెల్యేల ఆగడాలు, మంత్రి రాసలీలల గురించి, వారి అవినీతి అక్రమాలు, ఇసుక, మట్టి మాఫియాలపై టీడీపీ నాయకులే టీవీ చర్చల్లో బహిరంగంగా మాట్లాడుతున్నారన్నారు. కూటమి నాయకుల అఘాయిత్యాలు చూసి ప్రజలు భయపడుతున్నారని అన్నారు. ప్రభు త్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బకాయిలు ఎప్పటికప్పుడు చెల్లించడంతో పాటు, ఆరోగ్యశ్రీ వైద్యసేవలు అందుకున్న వారికి వైఎస్సార్ ఆసరా కింద ఖర్చులకు నగదు ఇచ్చేవారన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సె ప్స్ తీసుకువచ్చి వైఎస్ జగన్ ప్రజలందరికి వైద్యసేవలందించారని చెప్పారు. మాజీ సీఎం ఎన్‌టీ రామారావు ప్రవేశపెట్టిన పథకాలన్నీ చంద్రబాబు నిర్వీర్యం చేశారన్నారు. దేశంలో అత్యధిక ధనవంతుడైన, అత్యధిక క్రిమినల్ కేసుల్లో ఉన్న రాజకీయ నాయకుడు చంద్రబాబు అని అన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ జరగనివ్వబోమని చెప్పిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఇప్పుడు కేంద్రప్రభుత్వంతో ఎందుకు లాలూచీ పడ్డారన్నారు. అంటే అధికారంలో వచ్చిన ప్రతిసారి రాష్ట్ర ప్రయోజనాలు, తాకట్టు పెట్టి మీరు ప్రయోజనాలు పొందుతున్నారన్నారు. చంద్రబాబు శ్రీసన్‌శ్రీక్షేమం కోసమే పాకులాడుతూ రాష్ట్ర ప్రజలు ప్రయోజనాలను గాలికొదిలేశారని వేణు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన రూ.రెండు లక్షల కోట్ల అప్పులపై శ్వేతపత్రం విడుదల చే యాల ని డిమాండ్ చేశారు. ఋషికొండలో రూ.400 కోట్లతో అత్యాధునిక భవనాలు నిర్మిస్తే వాటిపై దుష్ప్రచారం చేశారని అన్నారు. ల్యాండ్‌టైటిల్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఆ యాక్ట్‌ను అమలు చేసిన రెవెన్యూ అధికారులు అవార్డులు తీసుకుంటున్నారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల వీర్రాజు(బాబు), పార్టీ దివ్యాంగులసెల్ జిల్లా అధ్యక్షుడు ముత్యాల పోసికుమార్, జిల్లా కార్యదర్శి ముద్దాల అను, పార్టీ నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు కొత్తపల్లి శివాజీ, పార్టీ నగర కార్యదర్శి పడమటి కామరాజు పాల్గొన్నారు.