
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
పంచారామ క్షేత్రంలో రద్దయిన వ్రతాలు
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరి సమేత కుమారరామభీమేశ్వరస్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా చివరి శుక్రవారం రోజున సామూహిక వరలక్ష్మీ వ్రతాలు రద్దు చేసిన విషయం తెలియక ఆలయానికి వచ్చిన అనేకమంది మహిళా భక్తులు వెనుతిరిగి వెళ్లిపోయారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మినహా మిగిలిన అన్ని శుక్రవారాలలోను 15 ఏళ్లుగా పంచారామ క్షేత్రంలో సామూహిక వ్రతాలు నిర్వహిస్తున్నారు.
అయితే ప్రస్తుతం రెండు, నాల్గవ శుక్రవారాల్లో మాత్రమే పంచారామ క్షేత్రం సామూహిక వ్రతాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయం తెలియని అనేకమంది మహిళలు చివరి వారంలోను సామూహిక వ్రతాలు జరుగుతాయని భావించి ఆలయానికి తరలి వచ్చారు. వ్రతాలు నిర్వహించడం లేదని తెలిసి మహిళలు నిరాశతో వెనుతిరిగి వెళ్లి పొయారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయంలో ప్రైవేటుగా వ్రతాలను నిర్వహించుకున్నారు.