
విలసలే లేవు.. ఇక పులసలెక్కడివి?
సముద్రంలో విలసలు గోదావరికి వస్తేనే కదా పులసలుగా మారేది. ఇప్పుడు సముద్రం నుంచి గోదావరి వైపు అసలు విలసలే రావడం లేదు. ఒకప్పుడు జూలై వచ్చిందంటే అర్ధరాత్రి వేటకు వెళ్తే తెల్లారేసరికి 10, 15 పులసలతో తిరిగొచ్చే వాళ్లం. ఇప్పుడు ఒకట్రెండు కూడా దొరకడమే గగనమైపోతోంది. గోదావరిలో లభించే పులసల కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. ఇప్పుడు పులసల కోసం జనం వస్తున్నా నిరాశతో వెనుదిరిగిపోతున్నారు. గోదావరి, సముద్రం కలిసే నదీ ముఖద్వారం వద్ద యానాం సమీపాన భైరవపాలెం వద్ద చమురు కంపెనీలు గ్యాస్ పైప్‌లైన్ వేసే సమయంలో తవ్వకాల వల్ల ఇసుక మేటలు వేశాయి. ఈ మేటలు తొలగించడంతో పాటు కేజీ బేసిన్‌లో డ్రెడ్జింగ్‌పై నియంత్రణ ఉండాలి.
– పాలేపు పోసియ్య,
మత్స్యకారుడు, యానాం