వివాహేతర సంబంధం.. భర్త చెంపపై భార్య కొట్టడంతో భర్త మృతి | Andhra Pradesh: Woman Killed Husband Over His Extra-Marital Affair In East Godavari - Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. భర్త చెంపపై భార్య కొట్టడంతో భర్త మృతి

Sep 19 2023 11:52 PM | Updated on Sep 20 2023 7:37 PM

- - Sakshi

ఇదిలా ఉండగా.. అతడి భార్య.. అదే గ్రామానికి చెందిన కొల్లు వెంకటేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

తూర్పు గోదావరి: పండగ వేళ పాశర్లపూడి బాడవలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన ఘర్షణలో భార్య చేతిలో భర్త హత్యకు గురయ్యాడు. వివరాలివీ.. పాశర్లపూడి బాడవ పల్లవపాలేనికి చెందిన కొల్లు సాయికుమార్‌ (24).. అదే గ్రామానికి చెందిన యువతిని ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. సాయికుమార్‌ ఇళ్ల సీలింగ్‌ పనులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. అతడి భార్య.. అదే గ్రామానికి చెందిన కొల్లు వెంకటేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదే విధంగా ఈ నెల 17వ తేదీ రాత్రి ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో సాయికుమార్‌ చెంపపై భార్య గట్టిగా కొట్టడంతో అతడు మృతి చెందాడు. ఈ మేరకు హతుని తండ్రి కొల్లు వీరపండు నగరం పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటనపై పి.గన్నవరం సీఐ ప్రశాంత్‌కుమార్‌ ఆధ్వర్యాన నగరం ఎస్సై పి.సురేష్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సాయికుమార్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement