మేయర్‌ పీఠం వైఎస్సార్‌ సీపీదే | - | Sakshi
Sakshi News home page

మేయర్‌ పీఠం వైఎస్సార్‌ సీపీదే

Nov 27 2026 12:20 AM | Updated on Nov 27 2026 12:20 AM

● మాజీ మంత్రి కురసాల కన్నబాబు

● 66వ డివిజన్‌లో ఓటు వేసిన నేత

కాకినాడ రూరల్‌: నగర మేయర్‌ పీఠాన్ని వైఎస్సార్‌ సీపీ దక్కించుకోబోతోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాల రీజినల్‌ కో ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని 66వ డివిజన్‌లో తన సోదరుడు, సినీ దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ, కుటుంబ సభ్యులతో కలిసి ఆయన గురువారం ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పార్టీ మేయర్‌ అభ్యర్థి కాద సత్యశ్రీ, వెంకట రమణ దంపతులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్టు మీడియాకు తెలిపారు.

వైఎస్సార్‌ సీపీ తరఫున జనరల్‌ ఏజెంట్‌గా వ్యవహరించిన కన్నబాబు.. మేయర్‌ అభ్యర్థి సత్యశ్రీతో కలిసి రూరల్‌లోని తొమ్మిదింటితో పాటు సిటీలోని పలు డివిజన్లను సందర్శించి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగర ఓటర్లు చాలా తెలివైనవారని, ఉన్నత విద్యావంతులని వైఎస్సార్‌ సీపీకి మద్దతుగా నిలిచారని అన్నారు. పోలింగ్‌ సరళి చూస్తే నిశ్శబ్ద విప్లవంలా తమ మేయర్‌ అభ్యర్థి సత్యశ్రీకి సైలెంట్‌ ఓటింగ్‌ పడినట్లు అర్థమవుతోందని, విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement